స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. రేపు రాజమండ్రికి వెళ్లనున్న సీఐడీ బృందం

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ రెండ్రోజుల సీఐడీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను ప్రశ్నించేందుకు రేపే రాజమండ్రికి వెళ్లనున్నారు సీఐడీ అధికారులు .

ap cid officials to go rajahmundry on tomorrow to question chandrababu in skill development case ksp

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏసీబీ కోర్ట్ రెండ్రోజుల సీఐడీ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను విచారించేందుకు శనివారం సీఐడీ బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనుంది. ఏసీబీ కోర్ట్ సూచించిన నిబంధనల మేరకు సీఐడీ అధికారులు విచారించనున్నారు. 

కాగా.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును  సీఐడీ కస్టడీకి  ఏసీబీ కోర్టు అనుమతిని ఇచ్చింది.  రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ కస్టడీకి  ఏసీబీ  కోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే చంద్రబాబును ఎక్కడ విచారిస్తారని ఏసీబీ న్యాయమూర్తి సీఐడీని ప్రశ్నించింది.  జైల్లో విచారిస్తారా, తటస్థ ప్రదేశంలో విచారిస్తారా అని  జడ్జి ప్రశ్నించారు. సీఐడీ అధికారుల సమాధానం ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తామని జడ్జి చెప్పారు. అయితే జైల్లోనే విచారిస్తామని  ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి  సీఐడీ తరపు న్యాయవాదులు చెప్పారు.  దీంతో రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. 

Latest Videos

ALso Read: చంద్రబాబుకు షాక్: రెండు రోజులు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

విచారణ సమయంలో  ఒకరు లేదా ఇద్దరు లాయర్లకు కూడ అనుమతిని ఏసీబీ కోర్టు ఇచ్చింది.ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి  సాయంత్రం ఐదు గంటలలోపుగానే చంద్రబాబును ప్రశ్నించాలని  ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరో వైపు విచారణ సమయంలో తీసిన వీడియోలు బయటకు రాకుండా  చూడాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.విచారణ జరిపే అధికారుల పేర్లను కూడ ఇవ్వాలని న్యాయమూర్తి సీఐడీని కోరారు.

మరో వైపు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. అయితే కస్టడీ పిటిషన్ పై విచారణ సమయంలో బెయిల్ పిటిషన్ పై వాదనలు వినపడం సరైంది కాదని  ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.ఈ పిటిషన్ పై రేపు వాదనలను విన్పిస్తామని చంద్రబాబు న్యాయవాదులు చెప్పారు. అయితే  రేపు వాదనలను వినడానికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో  సోమవారంనాడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై  వాదనలు జరిగే అవకాశం ఉంది.
 

vuukle one pixel image
click me!