చంద్రబాబు సీటుపై బాలకృష్ణ కన్నేసాడు... అందుకే ఇదంతా..: రోజా సంచలనం

By Arun Kumar P  |  First Published Sep 22, 2023, 5:38 PM IST

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణపై ఏపీ మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేసారు. 


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై పర్యాటక మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణను టార్గెట్ గా చేసుకుని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో విజిల్ ఊదుతూ బాలకృష్ణ దారుణంగా ప్రవర్తించాడని అన్నారు. సినిమాల్లో మాదిరిగా రైటర్స్ రాసిచ్చే డైలాగులు చెప్పడం... మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం ఇక్కడ పనిచేయవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని గానీ, వైసిపిని గానీ ఏమన్నా అంటే వదిలిపెట్టబోమని బాలకృష్ణను రోజా హెచ్చరించారు. 

చంద్రబాబు జైలుకు వెళ్లగానే ఆయన సీటుపై బాలకృష్ణ కన్ను పడిందన్నారు రోజా. ఆ సీటును దక్కించుకోవడం కోసమే అసెంబ్లీలో ఇవాళ చంద్రబాబు సీటు ఎక్కాడన్నారు. నిజంగానే బాబు తుప్పు కాదు నిప్పు అయితే ఆ విషయం చెప్పడానికి కూడా మనసు రాలేదా? అంటూ బాలకృష్ణను ప్రశ్నించారు మంత్రి రోజా. 

Latest Videos

అసెంబ్లీకి గత రెండు రోజులుగా టీడీపీ చర్చకి వచ్చిందో లేక రచ్చకి వచ్చిందో ప్రజలకి ఇప్పటికే అర్థమయ్యిందని రోజా అన్నారు. షెల్ కంపెనీస్ ద్వారా డబ్బు అకౌంట్లకు వచ్చిందని తెలిసి పచ్చపార్టీకి పిచ్చి పట్టిందన్నారు. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారయ్యిందన్నారు. ఎన్నికల సమయంలో అడ్డంగా దొరికేసరికి టీడీపీ నాయకులకు బుర్రలు పనిచేయడం లేదని రోజా అన్నారు. 

Read More  చంద్రబాబు సీట్లో కూర్చోవయ్యా బాబు... మేము కోరుకునేది అదే: బాలకృష్ణతో అంబటి (వీడియో)

అసెంబ్లీలో మీసం తిప్పి తొడగొట్టిన బాలకృష్ణ చివరకు తోకముడిచి ఎందుకు పారిపోయారని రోజా నిలదీసారు. స్కిల్ డెవలప్ మెంట్ పై చర్చకు వచ్చే దమ్ము లేదా? లేక ఈ స్కాంలో మీకేమైనా వాటా వుందా? అని ప్రశ్నించారు. అసలు స్కామే జరగలేదు... వైసీపీ దగ్గర ఆధారాలు లేవన్నారుగా... మరి చర్చ అంటే ఎందుకు పారిపోయారని రోజా అడిగారు. బాలకృష్ణ కు సినిమాల్లోనే డైలాగ్ చెప్పడం వచ్చు... అసెంబ్లీ లో రాదా? అంటూ రోజా ఎద్దేవా చేసారు. 

ఏ తప్పూ చేయకుంటే ఈడి, సిబిఐ ఎంక్వయిరీతో చేయించాలని కోరాలి... అంతేకానీ పారిపోవడం ఎందుకంటూ టిడిపి నాయకులకు రోజా చురకలు అంటించారు. మీరు వేసిన పిటిషన్లు కోర్టులు  కొట్టేస్తున్నాయి... ఇప్పుడేమంటారు? జడ్జి ముందు కూడా మీసం తిప్పి,తొడలు కొట్టండి తెలిసిద్ధి అంటూ మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై బహిరంగ చర్చకి మేము వచ్చాము... టిడిపి నాయకులే పారిపోయారన్నారు మంత్రి రోజా. 

click me!