మార్గదర్శికి చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను ఏపీ సీఐడీ అటాచ్ చేసింది. గత కొంత కాలం క్రితం మార్గదర్శి సంస్థపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
అమరావతి: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడును పెంచింది. మార్గదర్శికి చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను ఏపీ సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. నిబంధనలకు విరుద్దంగా మార్గదర్శి సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని
సీఐడీ ఆరోపిస్తుంది. ఇదే విషయమై మార్గదర్శికి చెందిన సంస్థల్లో సీఐడీ అధికారులు ఈ ఏడాది మార్చి మాసంలో సోదాలు నిర్వహించారు. అయితే తాజాగా ఏపీ సీఐడీ మార్గదర్శికి చెందిన రూ., 793 కోట్లను అటాచ్ చేసింది.