నిబంధనలను పెంచండి..: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై హైకోర్టులో సీఐడీ పిటిషన్

By Sumanth Kanukula  |  First Published Oct 31, 2023, 4:24 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్  కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.


ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్  కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై మరికొన్ని నిబంధలు విధించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. చంద్రబాబు ఎటువంటి రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభల్లో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేయకూడదనే నిబంధన చేర్చాలని మెమోలో పేర్కొన్నారు.

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాల రీత్య ఇచ్చారని బెయిల్ ఇచ్చినందుకు.. కేవలం చికిత్సకు మాత్రమే ఆయన పరిమితం కావాలని ఆదేశాలు ఇవ్వాలని  హైకోర్టును సీఐడీ అధికారులు కోరారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా ముందు, మీడియా ముందు మాట్లాడకుండా పరిమితం చేయాలని మెమోలో కోరారు. ఇద్దరు సీఐడీ డీఎస్‌పీలను నిరంతరం చంద్రబాబను అనుసరించి కోర్టుకు నివేదిక సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

Latest Videos

ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఈరోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 4 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ. లక్ష పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తనకు నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలని పేర్కొంది. బెయిల్ గడువు ముగిసిన తర్వాత సరెండ్ అయ్యే సమయంలో ఆస్పత్రిలో చికిత్స వివరాలను సీల్డ్ కవర్‌లో జైలు సూపరింటెండెంట్ సమర్పించాలని పేర్కొంది.

click me!