ఏపీలో పరిషత్ ఎన్నికలకు ఎస్ఈసీ కసరత్తు: గవర్నర్‌తో సహానీ భేటీ

By narsimha lode  |  First Published Apr 1, 2021, 1:07 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పరిషత్ ఎన్నికల నిర్వహణకు  ఏపీ ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పరిషత్ ఎన్నికల నిర్వహణకు  ఏపీ ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. ఎపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ ఎస్ఈసీ నీలం సహానీ గవర్నర్ బిశ్వభూషన్ తో ఇవాళ సమావేశమయ్యారు. ఏపీ లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని  ఏపీ ఎస్ఈసీ గవర్న్ కు తెలిపారు.

రాష్ట్రంలో 125 జడ్పీటీసీలు, 2248 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన స్థానాల వివరాలను ప్రకటించేందుకు ఏపీ హైకోర్టు కూడ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం నాడు  ఏపీ ఎస్ఈసీ నీలం సహానీతో భేటీ అయ్యారు. ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణ గురించి చర్చించినట్టుగా సమాచారం.

Latest Videos

గత నెల 31వ తేదీన ఎస్ఈసీ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో  కొత్త ఎస్ఈసీగా నీలం సహానీ నియమించారు. ఇవాళ ఉదయం ఆమె బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం కార్యదర్శితో పాటు అధికారులతో చర్చించారు. 
 

click me!