సీఎం కుటుంబానికి ప్రత్యేక భద్రత, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు: కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం

By Sumanth Kanukula  |  First Published Sep 20, 2023, 1:28 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షన రాష్ట్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షన రాష్ట్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. మొత్తంగా 49 అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు కీలక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం తీసుకొచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఈ పథకం కింద ప్రోత్సహకం అందజేయాలని  నిర్ణయించారు. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి రూ. 50 వేలు, సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణులైన వారికి రూ. లక్ష ప్రోత్సాహకం నిర్ణయం తీసుకున్నారు. సామాజికంగా, ఆర్దికం వెనుక బడినవారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు.

-ముఖ్యమంత్రి, ఆయన కుటుంబానికి ఏపీఎస్‌ఎస్‌జీ(ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్) ద్వారా భద్రత కల్పించే బిల్లుకు ఆమోదం.  
-ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లకు ఆమోదం.  ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.
-ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం సవరణ బిల్లుకు ఆమోదం. ప్రఖ్యాత యూనివర్సిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్టసవరణ చేయనున్నారు. 
-ఎస్‌ఈసీ కార్యాలయంలో శాశ్వత ఉద్యోగుల నియామకానికి ఆమోదం. 
-మావోయిస్టు, రెవెల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్‌లపై ఏడాది పాటు నిషేధం. 
-అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ ఏర్పాటుకు ఆమోదం.
-విద్యాశాఖలో ఇంటర్నేషనల్ బాక్యులరేట్ సిలిబస్ అమలుకు సంబంధించిన ఆంశపై ఆమోదం.
-ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన చట్ట సవరణకు ఆమోదం. 

Latest Videos

click me!