ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు, లోక్‌ అదాలత్‌‌ల ఏర్పాటుకు ఆమోదం

Siva Kodati |  
Published : Sep 07, 2022, 03:35 PM ISTUpdated : Sep 07, 2022, 03:37 PM IST
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు, లోక్‌ అదాలత్‌‌ల ఏర్పాటుకు ఆమోదం

సారాంశం

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. సచివాలయంలో 85 కొత్త పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీరికే కాకుండా వారికి పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నాలుగు జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్‌ల ఏర్పాటు ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది. 

నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్‌ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఒక్కో లోక్ అదాలత్‌లకు పది పోస్టులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎలాంటి బిల్లులు పెట్టాలి... ఏపీ ఛారిటబుల్, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన సవరణ బిల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో నోవాటెల్ గ్రూప్‌కు చెందిన ఫైవ్ స్టార్ హోటల్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ పార్క్ నిర్మాణాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఏర్పడిన 24 రెవెన్యూ డివిజన్లలో 456 కొత్త పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు ఏపీసీఆర్డీఏలోనూ కొన్ని సవరణలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?