అత్తతో అల్లుడి అసభ్య ప్రవర్తన.. ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు...

By Bukka SumabalaFirst Published Sep 7, 2022, 2:06 PM IST
Highlights

భార్య తల్లి మీద చెయ్యేశాడో దుర్మార్గుడు. అదనపు కట్నం కోసం ఫోన్ లో వేధించడమే కాకుండా.. ఎవరూ లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేరానికి గానూ అల్లుడికి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు.

ఒంగోలు : అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి ఎం సోమశేఖర్ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. చీరాలకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి చెప్పుల దుకాణం నిర్వహించేది. ఆమె కుమార్తెను చిత్తూరు జిల్లాకు చెందిన కోలా జాన్ కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం జాన్ వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది.

ఈ క్రమంలో జాన్.. భార్య తల్లికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవాడు. చివరకు ఒకరోజు చీరాలకు వచ్చి  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించబోయాడు. దీంతో ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చింది. ఆ తర్వాత భర్తతో కలిసి చీరాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే సీఐ వి.సూర్యనారాయణ దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం నిరూపణ అయినట్లుగా న్యాయమూర్తి పేర్కొంటూ నిందితుడు జాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో  మరో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యత్తవు కొండారెడ్డి వాదించగా,  కోర్టు  లయన్ ఆఫీసర్గా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. 

ఏపీలో జనసేనతో కలిసే ముందుకు.. రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాం: ఎంపీ జీవీఎల్

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని పూణెలో దారుణం చోటు చేసుకుంది. ఆగస్ట్ 23న పూణెలోని తేర్ సమీపంలోని ముఠా నది ఒడ్డున  ఓ మనిషి శరీర భాగం నదిలో తేలుతూ కనిపించింది. దీనిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో...వారు వచ్చి.. ఆ శరీరభాగాన్ని సేకరించారు. గాలింపు చేపట్టడా.. నదిలో గోనె సంచిలో కుక్కి పడేసిన మిగతా శరీర భాగాలు కూడా దొరికాయి. అవి 62 ఏళ్ల వృద్ధురాలి శరీరభాగాలుగా, ఆమెను హత్య చేసినట్టుగా పోలీసు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన గతనెలలో వెలుగులోకి రాగా ఈ కేసును పుణె పోలీసులు తాజాగా ఛేదించారు. 

ఆమె హత్య కేసులో కొడుకు, మనవడిని అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. బాధితురాలి కుమారుడు సందీప్ గైక్వాడ్, ఆమె మనవడు సాహిల్‌గా నిందితులను గుర్తించాడు. బాధితురాలు ఉషా గైక్వాడ్‌ వారిద్దరినీ తనింట్లోనుంచి వెళ్లమన్నందుకు కోపంతో ఈ నేరానికి పాల్పడ్డారు. "ఆగస్టు 5న, సాహిల్, సందీప్ ముధ్వా పోలీస్ స్టేషన్‌లో ఉషా గైక్వాడ్ కనిపించడం లేదంటూ మిస్సింగ్ ఫిర్యాదు చేశారు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

బాధితురాలి కుమార్తె శీతల్ కాంబ్లే కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, ఉషా గైక్వాడ్ అదృశ్యం వెనుక తండ్రీకొడుకుల పాత్ర ఉందని ఆయన అన్నారు. సందీప్, సాహిల్‌లను అదుపులోకి తీసుకున్నామని, కేశవ్ నగర్ ప్రాంతంలోని ఇల్లు, బంగారు ఆభరణాలు బాధితురాలి పేరు మీద ఉండటంతో వారు ఆమె మీద ఆగ్రహంతో ఉన్నారని తమ విచారణలో తేలిందని అధికారి తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సాహిల్ మహిళను గొంతుకోసి హత్య చేశాడు. 

ఆ తరువాత ఎలక్ట్రిక్ కట్టర్ మెషీన్‌ని కొనుగోలు చేసి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని గోనె సంచిలో మూటకట్టి నదిలో పడేశాడు అని పోలీసులు తెలిపారు. అలా ఆగస్ట్ 23న ముఠా నది ఒడ్డున తేర్ సమీపంలో అందులోని ఓ శరీర భాగం తేలుతూ కనిపించింది. అలా కేసు వెలుగులోకి వచ్చింది.. హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి అభియోగాల కింద మృతురాలి కొడుకు, మనవడి మీద కేసు నమోదు చేశారు.

click me!