AP Cabinet Meeting: మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం

By Mahesh RajamoniFirst Published Sep 20, 2023, 3:24 PM IST
Highlights

Amaravati: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధ‌వారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. పదవీ విరమణ సమయంలో నిరాశ్రయులైన ఉద్యోగులకు ఇల్లు ఇవ్వాలని పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల పిల్లలను ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పరిధిలోకి తీసుకురావాలని కేబినెట్  నిర్ణ‌యం తీసుకుంది. అలాగే, మ‌రో కొత్త ప‌థ‌కానికి మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  
 

AP Cabinet Meeting: జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరిట మ‌రో కొత్త‌ పథకానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధ‌వారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. పదవీ విరమణ సమయంలో నిరాశ్రయులైన ఉద్యోగులకు ఇల్లు ఇవ్వాలని పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల పిల్లలను ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పరిధిలోకి తీసుకురావాలని కేబినెట్  నిర్ణ‌యం తీసుకుంది. అలాగే, మ‌రో కొత్త ప‌థ‌కానికి మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరుతో తీసుకురాబోయే కొత్త ప‌థ‌కానికి బుధ‌వారం జ‌రిగిన స‌మావేశంలో మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఈ ప‌థ‌కం కింద‌ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన వారికి రూ.50వేలు, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే రూ.లక్ష ఇవ్వాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది.

జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ పేరుతో కొత్త ప‌థ‌కం తీసుకురావ‌డంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, పేరున్న విశ్వవిద్యాలయాలతో జాయింట్ సర్టిఫికేషన్ కు వీలుగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు ఆమోదం, అందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలను జాయింట్ సర్టిఫికేషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కొత్తగా స్థాపించిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని టాప్ 100 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకునేలా చట్ట సవరణల‌కు నిర్ణ‌యాలు తీసుకుంది.

అలాగే, రాజ‌ధాని అంశంపై కీల‌కంగా చ‌ర్చ జ‌రిగినట్టు స‌మాచారం. వ‌చ్చే దసరా నుండి విశాఖపట్టణం నుండి పాలన సాగించనున్నట్టుగా మంత్రివ‌ర్గం స‌మావేశంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి చెప్పిన‌ట్టు ప‌లువురు మంత్రులు పేర్కొన్నారు. మూడు రాజధానుల్లో భాగంగా ఒక‌టైన విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా కొన‌సాగుతుంద‌ని ప‌లుమార్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా నుండి విశాఖ నుండి పాలన ప్రారంభించాలని  నిర్ణయం తీసుకున్నట్టు స‌మాచారం.

click me!