ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ: సీఎస్ ఎల్వీకి చంద్రబాబు అభినందన

By Nagaraju penumalaFirst Published May 14, 2019, 5:33 PM IST
Highlights

ఇకపోతే ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పనితీరుపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ అద్భుతంగా పనిచేశారని అందుకు సీఎస్ కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. 


అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. సిఈసీ అనుమతి అనంతరం మంగళవారం మధ్యాహ్నాం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో కరువు, ఫొని తుఫాన్, తాగునీటి ఎద్దడి వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అజెండాలోని అంశాలైన వాతావరణం పరిస్థితులు ఉపాధి హామీ పనులపై కూడా చర్చలు  జరిగాయి. 

ఈ సందర్భంగా ఉపాధిహామీ పథకం అమలులో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని దానికి సంబంధించి ఆయా శాఖ అధికారులను చంద్రబాబు అభినందించారు. ఐదు విభాగాల్లో మొదటి స్థానంలో, ఆరు విభాగాల్లో రెండో స్థానంలో ఏపీ నిలిచిందని చంద్రబాబుకు అధికారులు స్పష్టం చేశారు. 

దీంతో ఆయా శాఖ అధికారులను చంద్రబాబు అభినందించారు. ఇకపోతే ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పనితీరుపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ అద్భుతంగా పనిచేశారని అందుకు సీఎస్ కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. 

ఫొని తుఫాన్ వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఏర్పడిన పంటనష్టంపై చర్చించారు. అక్కడ రైతులను ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే తాగునీటికి సంబంధించి నిధులు ఉన్నంత వరకు ఖర్చుపెట్టాలని ప్రజలకు సాగునీరు, తాగునీరుపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.   
 

ఈ వార్తలు కూడా చదవండి

మంత్రులకు చంద్రబాబు విందు: కీలక మంత్రులు డుమ్మా

ఏపీ కేబినెట్ భేటీ : కీలక మంత్రులు డుమ్మా

click me!