బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్ లో ఈ ఆర్డినెన్స్ కు మంత్రులు ఆమోదముద్ర వేసింది.
అమరావతి: బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్ లో ఈ ఆర్డినెన్స్ కు మంత్రులు ఆమోదముద్ర వేసింది.
మూడు మాసాల పాటు రూ. 80 నుండి రూ. 90 వేల కోట్ల బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ ఫైల్ ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ వద్దకు చేరుకొంది. రెండు మూడు రోజుల్లో ఈ ఆర్డినెన్స్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ నెలాఖరువరకు బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులోపుగా నిర్వహించే అవకాశం లేకపోవడంతో బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం తలపెట్టింది.ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాలకు బడ్జెట్ తదితర వాటికి బడ్జెట్ ఆర్డినెన్స్ కు తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రెండు, లేదా మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్.వరుసగా రెండో ఏడాది బడ్జెట్ పై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఏపీ సర్కార్.