ఏపీలో కరోనా విజృంభణ... ఆ నాలుగు జిల్లాలకు సర్వే టీమ్స్

Arun Kumar P   | Asianet News
Published : Mar 26, 2021, 11:32 AM ISTUpdated : Mar 26, 2021, 11:37 AM IST
ఏపీలో కరోనా విజృంభణ... ఆ నాలుగు జిల్లాలకు సర్వే టీమ్స్

సారాంశం

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల డిఎంహెచ్వో లతో మంత్రి ఫోన్ లో మాట్లాడి పలు సూచనలు చేశారు.

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. దీంతో కరోనా నివారణకు అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అప్రత్తం చేశారు. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల డిఎంహెచ్వో లతో మంత్రి ఫోన్ లో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఇకపై ప్రతి రోజు ఉదయం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 

కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి  నాని అదేశించారు. కేసులు ఎక్కువగా బయటపడుతున్న జిల్లాల్లో కోవిడ్ హాస్పిటల్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దృష్ట్యా సర్వే టీమ్స్ రంగంలోకి దించినట్లు మంత్రి వెల్లడించారు. 

read more   ఏపీకి డేంజర్ బెల్స్: ఒకే రోజు 758 కేసులు.. గుంటూరు, చిత్తూరులలో భయానకం

చిత్తూరు జిల్లా మూడు రాష్ట్రాలకు సమీపంలో ఉండడంతో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం వుందన్నారు. ఈ జిల్లాలో ప్రస్తుతం 750 యాక్టీవ్ కేసులున్నట్లు... వీరిలో 187మంది స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిపారు. వీరంతా హోంక్వారంటైన్ లో వున్నట్లు తెలిపారు. తిరుపతి రుయా, స్విమ్స్ హాస్పిటల్స్ 124మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. 

విజయవాడ కార్పొరేట్ హాస్టల్స్ విద్యార్థులు 70మంది చిత్తూరు జిల్లాకు రావడం వల్ల ఎక్కువ మందికి కరోనా సోకినట్టు గుర్తించినట్లు చిత్తూరు జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య మంత్రికి తెలిపారు. కరోనా కేసులు పెరిగితే ముందస్తుగా చిత్తూరు, మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్స్ 180బెడ్స్ సిద్ధం చేసామన్నారు. ప్రతి రోజు 5వేల మందికి ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ను వేగంగా చేపడుతున్నట్లు... ఈ విషయంలో చిత్తూరు జిల్లా అగ్రగామిగా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్క రోజు 16వేల 800మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు మంత్రి ఆళ్ల నానిగారికి ఫోన్ ద్వారా తెలిపారు  పెంచలయ్య.  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ప్రాంతంలో కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వో డాక్టర్ గౌరిశ్వరావు ను అదేశించారు మంత్రి ఆళ్ల నాని.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!