విశాఖ భూముల అక్రమాలపై సిట్ రిపోర్టు‌కు ఆమోదం: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

By narsimha lode  |  First Published Jul 12, 2023, 4:17 PM IST

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం  ఇవాళ  జరిగింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ భేటీ సాగింది. సుమారు  నాలుగు గంటల పాటు  ఈ సమావేశం జరిగింది. 
 


అమరావతి:విశాఖ భూముల అక్రమాలకు  సంబంధించి  సిట్ ఇచ్చిన రిపోర్టుకు  కేబినెట్ ఆమోదం తెలిపింది.   బుధవారంనాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన  ఏపీ కేబినెట్ సమావేశం  జరిగింది.  సుమారు  నాలుగు గంటలపాటు   ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.  శ్రీకాకుళం జిల్లా భావనపాడు-మూలపేట పోర్టు నిర్మాణం కోసం రుణానికి అనుమతిని ఇచ్చింది  కేబినెట్. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3,880  కోట్ల రుణానికి  ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

also read:9 నెలల్లోనే ఎన్నికలు, సిద్ధం కండి: మంత్రులతో వైఎస్ జగన్

Latest Videos

undefined

 భూమిలేని నిరుపేదలకు  లంక భూముల కేటాయింపునకు  మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంప్డ్  స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్  ఆమోదం తెలిపింది. టిడ్కో కాలనీల్లో  250 ఎకరాలకు  విక్రయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు  రూ. 454 కోట్లు పరిహార ప్యాకేజీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక  బోర్డులో  ఆమోదించిన ప్రాజెక్టుకు  కేబినెట్ ఆమోదం తెలిపింది.ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో  సుమారు  55 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

గ్రామాల్లోని కులవృత్తులు చేసుకునే వారికి ఇచ్చిన ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు  కేబినెట్ ఆమోదం తెలిపింది.  దీంతో  1.13 లక్షల మంది బీసీలకు  ప్రయోజనం కలగనుంది.1996  రెవిన్యూ గ్రామాల్లో  ఎస్సీలకు  స్మశాన వాటికల ఏర్పాటుకు  కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విభజనకు  ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213  ఎకరాలకు సంబంధించి  కట్టాల్సిన రుణాలను  మాఫీ చేసింది ఏపీ కేబినెట్.ఈ భూములపై  పూర్తి హక్కులను దళితులకు  కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

అర్చకుల రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా  దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచుతూ  కేబినెట్ నిర్ణయం తీసుకుంది.టోఫెల్  పరీక్షలకు ప్రభుత్వ విద్యార్ధులకు  శిక్షణ కోసం ప్రముఖ విద్యా సంస్థ  ఈటీఎస్ తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


 

click me!