AP Budget 2022: ఏపీ బడ్జెట్‌లో అమ్మఒడికి రూ. 6500 కోట్లు

By narsimha lode  |  First Published Mar 11, 2022, 1:30 PM IST


అమ్మ ఒడి పథకానికి ఏపీ ప్రభుత్వం రూ 6500 కోట్లు కేటాయించింది. ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.


అమరావతి:Amma Vodiపథకానికి 2022-23  ఆర్ధిక సంవత్సరానికి  రూ.6500 కోట్లు కేటాయించినట్టుగా ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.ఏపీ  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy ఇవాళ AP Assemblyలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 

ఈ పథకం కింద  రూ. 15 వేల చొప్పున నేరుగా 44,48,865 మంది తల్లుల Bank  ఖాతాల్లో నగుదను జమ చేసినట్టుగా మంత్రి చెప్పారు. 1వ తరగతి నుండి Inter చదువుతున్న  64 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకం కింద లబ్ది చేకూరుతుందని  మంత్రి తెలిపారు.  నాడు-నేడు పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ ను అభివృద్ది చేస్తున్నామని ఆర్ధిక మంత్రి చెప్పారు.

Latest Videos

నాడు-నేడు స్కీమ్ కింద తొలి దశలో 15,715 Schools లో 10 మౌళిక సదుపాయాల ఆధునీకరణ పూర్తైంది.ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఫ్యాన్లు, లైట్లు, తాగు నీరు, మరుగుదొడ్లు,ప్రహారీగోడ, ఇంగ్లీష్ ల్యాబ్, పెయింటింగ్ తో పాటు అవసరమైన మరమ్మత్తులు నిర్వహించిన విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రెండో దశలో 16,368 స్కూల్స్, మూడో దశలో 24,620 స్కూల్స్ ఆధునీకీకరించనున్నామని మంత్రి చెప్పారు.

జగనన్న గోరు ముద్ద పథకం కింద 45,584 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్ లో 37 లక్షల మంది విద్యార్దులకు ప్రతి రోజూ పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.జగనన్న విద్యా కానుక స్కీమ్ కింద 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్ధులకు  స్కూల్ లో చేరిన తొలి రోజే విద్యార్ధన కిట్ అందిస్తున్న విషాయాన్ని మంత్రి గుర్తు చేశారు.

click me!