విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 07, 2021, 09:38 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని, అద్భుతంగా ఉంటుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు.  సీఎం జగన్‌ను ఒక్క బీజేపీ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు

విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని, అద్భుతంగా ఉంటుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు.  సీఎం జగన్‌ను ఒక్క బీజేపీ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ రేటు తగ్గే అవకాశం ఉంటుందని వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే జీఎస్టీ పరిధిలోకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదని ఆయన విమర్శించారు.

ప్రజల సహకారంతోనే ప్రధాని మోడీ... చైనాని కట్టడి చేయగలిగారని సోము వీర్రాజు తెలిపారు. అమరావతిలోనే రాజధానిని కట్టాలని, తమకు అవకాశం ఇస్తే మూడేళ్లలో అద్భుతంగా కట్టి చూపిస్తామని వీర్రాజు స్పష్టం చేశారు. 

నిన్న కూడా మీడియాతో మాట్లాడిన సోము.. జగన్ కు చెక్ పెట్టే పార్టీ బీజేపీయేనని ఆయన చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేల చెప్పు చేతుల్లో పోలీసులు, రెవిన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.  

ఈ ఎన్నికలను అధికార యంత్రాంగం నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు.అధికార పార్టీకి ఏజంట్లుగా పోలీసులు, రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్త సినిమా చూపిస్తున్నంటూ కొత్త అస్త్రాన్ని జగన్ ప్రయోగిస్తున్నారని ఆయన విమర్శించారు.

అంత పెద్ద మెజార్టీ ఉన్న జగన్ ప్రజా మద్దతు కోల్పోయారా అని అడిగారు. అమృత పథకం కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే నేటికీ పనులను  ప్రభుత్వం ప్రారంభించలేదన్నారు.  సంక్షేమ ఫలాల అమలు చేస్తున్నదెవరో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!