విజృంభిస్తోన్న కరోనా .. చిత్తూరులో తీవ్రత: ఏపీలో 8,90,692కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Mar 07, 2021, 07:22 PM IST
విజృంభిస్తోన్న కరోనా .. చిత్తూరులో తీవ్రత: ఏపీలో 8,90,692కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 136 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 136 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,90,692కి చేరుకుంది. కరోనా కారణంగా నిన్న చిత్తూరులో ఒకరు మరణించడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,174కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 998 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,82,520కి చేరుకుంది.

నిన్న ఒక్క రోజు 45,702 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన నిర్థారణా పరీక్షల సంఖ్య 1,42,36,179కి చేరింది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 14, చిత్తూరు 49, తూర్పుగోదావరి 3, గుంటూరు 15, కడప 11, కృష్ణ 11, కర్నూలు 2, నెల్లూరు 4, ప్రకాశం 9, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 12, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 2 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu