గవర్నర్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు

Published : Nov 23, 2018, 03:59 PM ISTUpdated : Nov 23, 2018, 04:17 PM IST
గవర్నర్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, మంత్రి వర్గం ఏపీని అవినీతి మయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.   


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, మంత్రి వర్గం ఏపీని అవినీతి మయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు. కన్నా లక్ష్మీనారాయణతోపాటు పార్టీ సీనియర్ నేతలు పురంధేశ్వరి, మాణిక్యాలరావు, కావూరి సాంబశివరావు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, సుధీష్ రాంభొట్ల, పాకలపాటి సన్యాసిరాజులు గవర్నర్ ను కలిశారు. 

ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. చంద్రబాబు అవినీతిపై వంద ప్రశ్నలతో కూడిన ఒక పుస్తకాన్నిగవర్నర్ కు అందజేసినట్లు తెలిపారు. 
 గత నాలుగున్నరేళ్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై, ఇసుక దోపిడీ వంటి అవినీతి విషయాలపై  తాను వారానికి ఐదు ప్రశ్నలు చంద్రబాబుకు సంధిస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 

అలా సుమారు 100 ప్రశ్నలు సంధించానని అయితే ఇఫ్పటి వరకు ఒక్కదానిపైనా సీఎం చంద్రబాబు నుంచి కానీ, సీఎం కార్యాలయం నుంచి కానీ సంబంధింత మంత్రుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి సమాధానం రాలేదన్నారు.

తన ప్రశ్నలపై ఏపీ సర్కార్ మౌనం దాల్చడం అంటే టీడీపీ ప్రభుత్వం అవినీతిని సమర్ధించుకుంటున్నట్లేనని చెప్పుకొచ్చారు. తాను సంధించిన వంద ప్రశ్నలను ఒక పుస్తకరూపం లో అచ్చు వేయించి గవర్నర్ నరసింహన్ కు సమర్పించినట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కంభంపాటిని పక్కనపెట్టిన బీజేపీ

ద్రోహం చేసిన బీజేపీతోనా, మంచి చేసే కాంగ్రెస్ తోనా:వైసీపీ,జనసేనలకు రఘువీరా

ఏపీలో బీజేపీ ఒక్క కార్పొరేటర్ స్థానం కూడా గెలవదు:లోకేష్

PREV
click me!

Recommended Stories

వేలఎ కరాలు ఎందుకు? Jagan Sensational Comments on Amaravati | Jaganmohan Reddy | Asianet News Telugu
CM Nara Chandrababu Naidu Speech: మెప్మా, డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు గుడ్ న్యూస్ | Asianet Telugu