మంత్రులను కాదు... సీఎంనే మార్చాలి, ఈ దారుణాలపై స్పందించరా : జగన్‌పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 10, 2022, 05:34 PM IST
మంత్రులను కాదు... సీఎంనే మార్చాలి, ఈ దారుణాలపై స్పందించరా : జగన్‌పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యల ఘటనపై రాష్ట్ర బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైరయ్యారు. రాష్ట్రంలో మంత్రులను మార్చడం కాదని.. సీఎంనే మార్చాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతన్నా సీఎం జగన్ కనీసం స్పందించరా అని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) మండిపడ్డారు బీజేపీ నేత (bjp) విష్ణువర్థన్ రెడ్డి (vishnuvardhan reddy) . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న నెల్లూరులో (nellore) ప్రేమోన్మాది యువతిని కాల్చి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన విచారకరమన్నారు. అటు సత్యసాయి జిల్లాలో (sri sathya sai district) వెంటవెంటనే రెండు ఘటనలు జరిగాయని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా సీఎం స్పందించరా? హోంమంత్రి ఈ విషయాలపై నోరు మెదపరా? అని ఆయన ప్రశ్నించారు. 

ఏది జరిగినా గంటలో మీడియా ముందుకు వచ్చే మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు వీటిపై మాట్లాడరా? అని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలు వీటిపై స్పందించకుండా, దృష్టి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనలపై సీఎం, హోంమంత్రి ఎందుకు సమీక్ష చేయలేదని విష్ణువర్ధన్ రెడ్డి ఫైరయ్యారు. ఏపీలో శాంతిభద్రతల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. మంత్రులను మార్చడం కాదని, ముఖ్యమంత్రినే మార్చితే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆయన సెటైర్లు వేశారు.

కాగా,  సోమవారం సాయంత్రం కావ్యరెడ్డిపై కాల్పులు జరిపి మాలపాటి సురేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు తాటిపర్తిలో మీడియాతో మాట్లాడారు. మాలపాటి సురేష్ రెడ్డి ఉపయోగించిన తుపాకీపై మేడిన్ యూఎస్ఏ అని రాసి ఉందన్నారు. అయితే, ఈ తుపాకీ ఇక్కడే తయారు చేసి ఉండవచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. 

కావ్యరెడ్డి ఇంటికి వెళ్లిన సురేష్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని సురేష్ రెడ్డి భావించాడు. ఈ విషయమై కావ్య కుటుంబ సభ్యులతో చర్చించాడు. చర్చించాడు. అయితే, కావ్య, సురేష్ రెడ్డితో పెళ్ళికి నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సురేష్ రెడ్డి కావ్య ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సురేష్ రెడ్డి, కావ్యలు గతంలో చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోం లో భాగంగా వీరిద్దరూ సొంత ఊర్లనుంచే పనులు చేస్తున్నారు. వీరిద్దరిదీ ఒకే ఊరు. అంతేకాదు సురేష్ రెడ్డి దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

సురేష్ రెడ్డి ఓ పైకో : కావ్య బంధువు
సురేష్ రెడ్డి ఓ సైకో అని కావ్య బంధువు ఒకరు తెలిపారు. సురేష్ రెడ్డి గురించి అతని సన్నిహితులు చాలామంది నెగటివ్ గా  చెబుతున్నారన్నారు. కావ్య పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే కక్షతో సురేష్ రెడ్డి  ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. సురేష్ రెడ్డి గురించి తమకు ఇంతకు ముందు ఈ విషయాలు తెలియవని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!