పవన్‌తో చదలవాడ భేటీ: బాబుకు షాకిస్తారా?

Published : Sep 20, 2018, 05:53 PM IST
పవన్‌తో చదలవాడ భేటీ: బాబుకు షాకిస్తారా?

సారాంశం

టీటీడీ మాజీ ఛైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు.  పవన్ కళ్యాణ్‌తో చదలవాడ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.


తిరుపతి:టీటీడీ మాజీ ఛైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు.  పవన్ కళ్యాణ్‌తో చదలవాడ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. చదలవాడ  టీడీపీని వీడి జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మెన్ గా చదలవాడ కృష్ణమూర్తి పనిచేశాడు.  గత ఎన్నికల సమయంలో చదలవాడ కృష్ణమూర్తికి తిరుపతి అసెంబ్లీ టిక్కెట్టు దక్కలేదు. తిరుపతి టిక్కెట్టు ఇవ్వని కారణంగా టీటీడీ ఛైర్మెన్ పదవిని  చంద్రబాబునాయుడు  చదలవాడకు కట్టబెట్టారు.

చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ ఛైర్మెన్ పదవి కాలం ముగిసిన తర్వాత ఇటీవలనే సుధాకర్ యాదవ్‌కు టీటీడీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు.  అయితే చదలవాడ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీని వీడి జనసేనలో చేరాలని చదలవాడ నిర్ణయం తీసుకొన్నారా... ఈ కారణంగానే  ఆయననను కలిశారా అనే చర్చ కూడ లేకపోలేదు.

అయితే  ఈ విషయమై చదలవాడ ఇంకా  అధికారికంగా ఏ విషయాన్ని ప్రకటించలేదు. పార్టీలో చేరేందుకు కలిశారా... ఇతర విషయాలపై చర్చించేందుకు కలిశారా అనే విషయాలపై  ఇంకా స్పష్టత రావాల్సి ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?