
ప్రత్యేక హోదాకు (ap special status) తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని.. అందుకే అజెండా నుంచి తొలగించారని ఏపీ బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu verraju) వ్యాఖ్యానించారు. విభజన సమస్యలపై ‘హోదా’ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్రంతో చర్చించవచ్చని ఆయన సూచించారు. ఈనెల 17న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీకీ వస్తున్నారని.. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని సోము వీర్రాజు చెప్పారు. ఏపీలో రూ.23 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం పనులు చేపట్టిందని... ఇప్పటికే కొన్ని చోట్ల పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలంటే ప్రేమ.. కాపులంటే ద్వేషం ఎందుకని వీర్రాజు ప్రశ్నించారు. ముస్లింలకు ఏపీలో 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, మరి కాపులకు ఎందుకివ్వరని ఆయన నిలదీశారు. అభివృద్ధి నిరోధకులుగా జగన్ ప్రభుత్వం మారిందని.. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవడంలేదని వీర్రాజు ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశమని... ఈ నెల 17న ఏపీ, తెలంగాణ ఆస్తులపైనే చర్చ జరుగుతుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.
అంతకుముందు ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆదివారం నాడు ఆయన విశాఖపట్టణంలో GVL Narasimha Rao మీడియాతో మాట్లాడారు. అనవసరంగా Specail status అంశాన్ని Telangana విబేధాలతో ముడిపెట్టొద్దని జీవీఎల్ నరసింహారావు సూచించారు. ప్రత్యేక హోదా వ్యవస్థ ఇప్పుడు లేదని ఆయన తేల్చి చెప్పారు.Congress, TDP, YCP వల్లే ఏపీ నష్టపోయింని ఆయన చెప్పారు.కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ది జరుగుతుందన్నారు.అదనపు నిధులు రావాలని Andhra Pradesh కోరుకోవడంలో తప్పులేదని జీవీఎల్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయానికి, ఖర్చులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నందున కేంద్రం ప్రత్యేకంగా ఏపీకి నిధులు ఇస్తుందన్నారు. కానీ ఇతర రాష్ట్రాలకే ఈ తరహలో నిధులను ఇవ్వడం లేదని జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వ్యవస్థ ఇప్పుడు లేదన్నారు. రెవిన్యూ డిఫిసిట్ గ్రాంట్ కింద నిధులు లభిస్తున్నాయని జీవీఎల్ వివరించారు. తెలంగాణ,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఈ గ్రాంట్ కింద నిధులు రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇవ్వడం లేదని చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు