Badvel ByPoll: అవన్నీ దొంగ ఓట్లే.. అందుకే పోలింగ్ పెరిగింది: సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 31, 2021, 1:31 PM IST

బద్వేలు ఉప ఎన్నికలో (Badvel ByPoll) పోలింగ్ శాతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu verraju) . పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం కేవలం దొంగ ఓటర్లేన‌ని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. 


బద్వేలు ఉప ఎన్నికలో (Badvel ByPoll) పోలింగ్ శాతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu verraju) . పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం కేవలం దొంగ ఓటర్లేన‌ని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. 

'బద్వేలు ఉపఎన్నికలలో అవినీతి, అరాచక, కుటుంబ, రాచరిక పాలనకు వ్యతిరేకంగా, అభివృద్ధికి మ‌ద్ద‌తుగా నిజాయితీగా ఓట్లు వేసిన ఓటరు మహాశయులందరికీ భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది' అని సోము వీర్రాజు చెప్పారు.
 

బద్వేలు ఉపఎన్నికలలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం కేవలం దొంగ ఓటర్లు,పోలింగ్ బూతులో కూర్చొని నాయకులు వేసుకున్న దొంగ ఓట్లు. ఈ అరాచకాలన్నింటిపై ఎన్నికల అధికారులందరికీ ఫిర్యాదు చేశాము. గుర్తించిన చోట రీ-పోలింగ్ పెట్టమని కోరాము.
Y C hea P?https://t.co/8x0Axh2cj1

— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju)

Latest Videos

 

'బద్వేలు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం కేవలం దొంగ ఓటర్లు, పోలింగ్ బూతులో కూర్చొని  వైఎస్సార్ సీపీ నాయకులు వేసుకున్న దొంగ ఓట్లు. ఈ అరాచకాలన్నింటిపై ఎన్నికల అధికారులందరికీ ఫిర్యాదు చేశాము. గుర్తించిన చోట రీ-పోలింగ్ పెట్టమని కోరాము' అని సోము వీర్రాజు తెలిపారు.

'వైఎస్సార్ సీపీ నాయకులు సాగిస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలందరూ చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. వారిలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను రాబోయే రోజుల్లో మీపై తప్పకుండా చూపిస్తారు, మిమ్మల్ని గద్దె దించుతారు' అని సోము వీర్రాజు చెప్పారు.

కాగా.. ఉప ఎన్నిక‌లో బ‌య‌టి వ్య‌క్తులు వ‌చ్చి ఓట్లు వేశార‌ని బీజేపీ ప‌లు వీడియోలు కూడా పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అలాగే, అధికారుల‌కు కూడా బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఆయా అంశాల‌పై సోము వీర్రాజు ట్విట్ట‌ర్ ద్వారా మ‌రోసారి స్పందించారు.

కాగా.. బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆయన చెప్పారు. మొత్తంగా 68.12 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు.  బద్వేల్ ఉపఎన్నిక సందర్భంగా పలు గ్రామాలలో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలను బీజేపీ అభ్యర్థి సురేశ్ అడ్డుకున్నారు. అయితే, దొంగ ఓట్లు వేస్తున్నారనేది అవాస్తవమని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (venkata subbaiah) ఆకస్మిక మరణంతో బద్వేల్‌ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కోవిడ్‌తో వాయిదా పడిన ఎన్నికలను అక్టోబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (election commission) షెడ్యూలు విడుదల చేసింది. అయితే, దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే వైసీపీ టికెట్‌ ఇచ్చినందున జనసేన (janasena) పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (pawan kalyan) ప్రకటించారు. పవన్ పోటీకి దూరమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే టీడీపీ (tdp) సైతం విరమించుకుంటున్నట్లు వెల్లడించింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ తాము బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పనతల సురేశ్‌ను అభ్యర్ధిగా వెల్లడించింది
 

click me!