
పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district) జంగారెడ్డిగూడెంలో (jangareddy gudem) గడచిన కొద్దిరోజులుగా 18 మృత్యువాత పడటం రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. వాంతులు, విరేచనాలకు గురవుతున్న జనం ఆసుపత్రుల్లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోతున్నారు. నాటు సారానే ఈ మరణాలకు కారణమని భావిస్తున్నా.. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మరణాలపై శుక్రవారమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఏపీ ప్రభుత్వాన్ని (ap govt) ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా స్పందించరా? అంటూ ఆయన మండిపడ్డారు.
తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) కూడా ఈ మిస్టరీ మరణాలపై స్పందించారు. జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంటున్న వరుస మరణాలపై జగన్ ప్రభుత్వం (ys jagan) తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మరణాలకు గల నిర్దిష్ట కారణాలను తెలియజేసి ప్రజల్లో భయబ్రాంతులను తొలగించాలని వీర్రాజు కోరారు. దీనితో పాటు మృతులకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
కాగా.. గత కొంత కాలం వరకు జంగారెడ్డి గూడెం ప్రాంతంలో అంతా బాగానే ఉంది. ఇటీవలే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత మంది మృతి చెందడానికి కారణాలు అన్వేశించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మృతుల కుంటుబాలను వెళ్లి కలుస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది కల్తీ సారా తాగడం వల్లనే చనిపోయారని మృతుల కుటుంబీకులు చెబుతున్నారు.
ఈ దర్యాప్తు నిర్వహించడానికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హైమావతి (Public Health Director Haimawati), విజయవాడ జీజీహెచ్ డాక్టర్ల టీమ్ (Vijayawada GGH Doctors Team) జంగారెడ్డి గూడెంకు చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్లకు ఈ టీం వెళ్లింది. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. వీరికి మృతి కారణాలు ఏంటనే విషయంలో ఓ అంచనాకు వచ్చారు. వివిధ కారణాలతో వారంతా చనిపోయారని అధికారులు చెబుతున్నారు. కానీ ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అలవాటు ఉందని చెప్పారు. ఇందులో పలువురు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారని తెలిపారు. మరి కొందరు 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నరని పేర్కొన్నారు. అయితే మృతుల కుటీంబీకులు మాత్రం తమవారు కల్తీ సారా తాగడం వల్లనే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మరణాల నేపథ్యంలో పలువురు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. గురువారం ఒకరు హాస్పిట్ లకు వెళ్లిన కొంత సమయానికి మృతి చెందారు. అయితే ఆయన మృతదేహానికి పోస్టు మార్టం చేయలేదు. ఇలా మృతి చెందిన వారెవరికీ పోస్టు మార్టం నిర్వహించలేదు. దీంతో అసలు మరణాలు ఏ కారణంతో సంభవిస్తున్నాయనే అంశంపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు.