రాజన్న రాజ్యంలో శత్రువును కూడా అక్కున చేర్చుకున్నారు కానీ ఇప్పుడు....: ఏపీ బీజేపీ చీఫ్ కన్నా

By Nagaraju penumalaFirst Published Sep 5, 2019, 7:05 PM IST
Highlights

రాష్ట్రంలో రెండు సార్లు పొత్తు పెట్టుకొని తీవ్రంగా నష్టపోయామని స్పష్టం చేశారు. ఇకపై ఏ పార్టీతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో రెండు సార్లు పొత్తు పెట్టుకొని తీవ్రంగా నష్టపోయామని స్పష్టం చేశారు. 

ఇకపై ఏ పార్టీతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్ళినా బీజేపీలోకి దళితులు, ముస్లీంలు ఎక్కువగా చేరుతున్నారని తెలిపారు. బీజేపీ సిద్దాంతం తెలుసుకోవడం వల్ల రాష్ట్రంలో పేద బడుగు వర్గాలవారు పార్టీలో చేరుతున్నారని ఆయన స్పష్టం చేశారు. 
 
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను అడ్డుపెట్టుకుని గ్రామాల్లో అరాచకం సృష్టించిందని ఇప్పుడు వైసీపీ కూడా అదే ధోరణితో పోతుందని విమర్శించారు. రాజన్న పాలనలోశత్రువును కూడా అక్కున చేర్చుకున్నారని ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి మంచిది కాదన్నారు. 

వైసీపీ ప్రభుత్వానికి చేతనైతే అసలు దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. కొన్నాళ్లుపోతే అసలు దొంగలు బయటపడతారని తెలిపారు. రాష్ట్రంలో వ్యక్తులు మారినా మైనింగ్ దోపిడీ ఆగడం లేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇకపోతే ఆంధ్రాబ్యాంక్ విలీనంపై నిరసనల విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్ళినట్లు కన్నా లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. 
 

click me!