గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తనను చీఫ్ మార్షల్స్ గా నియమించారని చెప్పుకొచ్చారు. వైయస్ బతికి ఉన్నంతకాలం సంప్రదాయంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆయన మరణానంతరం అదుపుతప్పారని చెప్పుకొచ్చారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో మార్షల్స్ పై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్. మార్షల్స్ అంటే బంట్రోతు అని చంద్రబాబు భావిస్తున్నారని మార్షల్స్ అంటే డీఎస్పీ స్థాయి అధికారి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు తాను చీఫ్ మార్షల్ గా పనిచేశానని అయితే వైయస్ మరణానంతరం తనను తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. గురువారం మార్షల్స్ పై చంద్రబాబు నాయుడు నాయుడు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. శాసన సభ నియమనిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు.
అయితే గురువారం చీఫ్ మార్షల్ పై చంద్రబాబు నాయుడు అండ్ టీం చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. మార్షల్స్ కూడా పోలీసు వ్యవస్థకు చెందిన వ్యక్తేనని చెప్పుకొచ్చారు.
కావాలని వచ్చి డ్రామాలాడుతున్నారు.. చంద్రబాబుపై కొడాలి నాని...
శాసనసభ ఆవరణలో గుంపులుగా రాకూడదని, ప్లకార్డులతో రావొద్దన్నది రూల్స్ బుక్ లో నిబంధన అని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు గుంపులుగా వస్తే వారిని అడ్డుకున్నారని గుర్తు చేశారు.
అయితే అడ్డుకున్న మార్షల్స్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అండ్ టీం వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. చీఫ్ మార్షల్స్ ను నెట్టేసి గొంతు పట్టుకుని పిసుకుతున్నారని అది ధర్మమా అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను నిలదీశారు ఆర్థర్.
పవన్ కల్యాణ్ మీద జనసేన ఎమ్మెల్యే రాపాక షాకింగ్ కామెంట్స్...
తనను గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తనను చీఫ్ మార్షల్స్ గా నియమించారని చెప్పుకొచ్చారు. వైయస్ బతికి ఉన్నంతకాలం సంప్రదాయంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆయన మరణానంతరం అదుపుతప్పారని చెప్పుకొచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమను వేధించారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆర్థర్. బాత్ రూమ్ ల దగ్గర, లాబీల దగ్గర జాగారం చేసేటువంటి దుస్థితి కల్పించారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ ఆరోపించారు.
మార్షల్స్‌ను చంద్రబాబు బాస్టర్డ్ అంటారా: జగన్..