బాబు! మిమ్మల్ని చూసి మేం ఏం నేర్చుకోవాలి: వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

By Nagaraju penumala  |  First Published Dec 11, 2019, 10:55 AM IST

అధికారం కోల్పోయామన్న నిరాశ, నిస్పృహలతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఇలాగే చంద్రబాబు వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని హెచ్చరించారు అనిల్ కుమార్ యాదవ్. 
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

చంద్రబాబు నాయుడు మాట్లాడితే తన రాజకీయ సీనియారిటీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం గురించి పదేపదే చెప్తుంటారని ఆయన అనుభవం గురించి ఏం చూసి నేర్చుకోవాలని నిలదీశారు. 

Latest Videos

undefined

చంద్రబాబు నాయుడు కనీసం స్పీకర్ స్థానాన్ని కూడా గుర్తించడం లేదని ఆయన్ను చూసి తాము ఏం నేర్చుకోవాలని నిలదీశారు. స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. 

అధికారం కోల్పోయామన్న నిరాశ, నిస్పృహలతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఇలాగే చంద్రబాబు వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని హెచ్చరించారు అనిల్ కుమార్ యాదవ్. 

బస్సు చార్జీల పెంపు: చంద్రబాబు సహా టీడీపీ నేతల నిరసన...

మరనోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరచిన చంద్రబాబు నాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాడ్ చేశారు. 

మరోవైపు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జోగి రమేష్. చంద్రబాబు నాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని హెచ్చరించారు ఎమ్మెల్యే జోగి రమేష్. 

అత్యంత రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు స్పీకర్ స్థానానికి కనీస గౌరవం ఇవ్వకపోడం విచారకరమన్నారు ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరచిన చంద్రబాబు సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

చంద్రబాబు స్పీకర్ తమ్మినేని సీతారాంకు క్షమాపణలు చెప్పడంతోపాటు సభకు కూడా క్షమాపణలు చెప్పాలని సూచించారు. ఈ విషయాన్ని ఇక్కడితో నిలిపివేయాలని స్పీకర్ సైతం ఈ విషయాన్ని మన్నించాలని ధర్మాన కృష్ణదాస్ సూచించారు. 


స్పీకర్ ను మర్యాదగా ఉండదన్న చంద్రబాబు: ఖవాళీ డాన్స్ కాదంటూ తమ్మినేని వార్నింగ్.

click me!