వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లీకులు

By Nagaraju penumalaFirst Published Dec 10, 2019, 12:00 PM IST
Highlights

2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ మూడోవస్థానానికే పరిమితమవుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో బాంబు పేల్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ఆదేశిస్తే వెంటనే వారంతా వైసీపీలో వచ్చి చేరతారంటూ తేల్చేశారు. జగన్ నిర్ణయం కోసం ఆ 13 మంది ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇకపోతే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది జగన్‌ పుణ్యమేనంటూ చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ షరతులు పెట్టకుండా ఉంటే ఎప్పుడో చంద్రబాబు ప్రతిపక్ష హోదా గల్లంతయ్యేదని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ మూడోవస్థానానికే పరిమితమవుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి అస్వస్థత:వైసీపీ సీఎల్పీలో వైద్యం

click me!