
కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యపై సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది.
సిట్ దర్యాప్తు బృందం ఈ కేసులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం విచారించింది. అలాగే వైయస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను కూడా విచారించింది.
ఇటీవలే టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు కడప ఎస్పీ అన్బురాజన్. బీటెక్ రవి విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సిట్ దర్యాప్తు బృందానికి తాను సహరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణరెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ నోటీసులతో నారాయణరెడ్డి సైతం విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు వారిని సిట్ బృందం విచారించింది.
వివేకా హత్య కేసు: సిట్ ఎదుట హజరైన ఆదినారాయణ రెడ్డి సోదరుడు...
అనంతరం మాజీమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు సిట్ బృందం నోటీసులు ఇచ్చినా మాజీమంత్రి తీసుకోలేదు. ఆదినారాయణరెడ్డిని విచారించాలన్న పట్టుదలతో ఉన్న సిట్ బృందం మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆదినారాయణరెడ్డి పాత్ర ఉందంటూ వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీత ఆరోపణలు చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో తన తండ్రికి పరిచయాలు ఉన్నాయని అందువల్లే తన తండ్రిని ఏదైనా చేసే అవకాశం ఆదినారాయణరెడ్డికి ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే మాజీమంత్రి వైయస్ వివేకా హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితోపాటు ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి సైతం హాజరయ్యారు. అయితే ఆదినారాయణరెడ్డి మాత్రం ఎందుకు డుమ్మా కొడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసు విచారణకు సంబంధించి స్టే తెచ్చుకునేందుకు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ తెలుస్తోంది. అయితే ఆదినారాయణరెడ్డి విచారణకు హాజరవుతారా లేక స్టే తెచ్చుకుంటారా అన్న అంశంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇకపోతే ఈ ఏడాది మార్చి 15న తన నివాసంలో వైయస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. హత్యకు సంబంధించి ఇప్పటి వరకు 1300 మంది అనుమానితుల్ని సిట్ బృందం విచారించింది. కొందరినీ నార్కో అనాలిసిస్ టెస్ట్ ల నిమిత్తం పుణెకు సైతం తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
వైఎస్ వివేకా హత్యకేసు: సిట్ విచారణకు టీడీపీ ఎమ్మెల్సీ, ఏమన్నారంటే......