ఈ నెల 20 ఏపీ అసెంబ్లీ సమావేశం.. బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన..?

Siva Kodati |  
Published : May 13, 2021, 07:46 PM ISTUpdated : May 13, 2021, 07:47 PM IST
ఈ నెల 20 ఏపీ అసెంబ్లీ సమావేశం.. బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన..?

సారాంశం

ఈ నెల 20న ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించించి గవర్నర్‌ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు

ఈ నెల 20న ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించించి గవర్నర్‌ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. బడ్జెట్‌ సమావేశాలను ప్రభుత్వం ఎన్ని రోజులు నిర్వహిస్తుంది. కరోనా నేపథ్యంలో పద్దు ప్రవేశపెట్టడం వరకే పరిమితమవుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.  

వాస్తవానికి మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా, ఎన్నికల కారణంగా సాధ్యపడలేదు.. దీంతో మార్చి నెలాఖరులో బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read:ఏపీలో కోవిడ్ ఉగ్రరూపం: కొత్తగా 22,399 కేసులు.. తూర్పుగోదావరిలో ఆందోళనకరం

మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. రూ.80 వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, నవరత్నాలు అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్‌ను రూపొందించారు. అయితే మూడు నెలల సమయం ముగియనుండటంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

School Holiday : రేపు స్కూళ్లకి సెలవు..? ఈ సడన్ హాలిడే ఎందుకో తెలుసా?
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం: Ernakulam Express Train Fire | Asianet News Telugu