ఏపీలో కోవిడ్ ఉగ్రరూపం: కొత్తగా 22,399 కేసులు.. తూర్పుగోదావరిలో ఆందోళనకరం

Siva Kodati |  
Published : May 13, 2021, 06:32 PM IST
ఏపీలో కోవిడ్ ఉగ్రరూపం: కొత్తగా 22,399 కేసులు.. తూర్పుగోదావరిలో ఆందోళనకరం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రెండు రోజుల పాటు తెరిపినిచ్చిన మహమ్మారి మళ్లీ పంజా విసిరింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. కానీ కేసుల తీవ్రత పెరుగుతుందే తప్ప ప్రయోజనం మాత్రం శూన్యం. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,399 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 13,66,785కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9,077కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 11, అనంతపురం 3, తూర్పుగోదావరి 9, చిత్తూరు 9, గుంటూరు 6, కర్నూలు 4, నెల్లూరు 5, కృష్ణ 8, ప్రకాశం 8, విశాఖపట్నం 11, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 3, కడప 4, పశ్చిమ గోదావరి నలుగురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 18,638 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 11,56,666కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 96,446 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,77,02,133కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,01,042 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 2080, చిత్తూరు 2646, తూర్పుగోదావరి 3372, గుంటూరు 2141, కడప 1447, కృష్ణ 910, కర్నూలు 1365, నెల్లూరు 1589, ప్రకాశం 1489, శ్రీకాకుళం 824, విశాఖపట్నం 2064, విజయనగరం 896, పశ్చిమ గోదావరిలలో 1576 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu