ఎవరికి ఎలా చెక్ పెట్టాలో తెలుసు: కూన రవికుమార్ పై తమ్మినేని ఫైర్

Published : Jul 16, 2021, 04:46 PM IST
ఎవరికి  ఎలా చెక్ పెట్టాలో తెలుసు: కూన రవికుమార్ పై తమ్మినేని ఫైర్

సారాంశం

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ పై  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైరయ్యారు.  కొంతకాలంగా  వీరిద్దరి మధ్య  మాటల యుద్దం కొనసాగుతోంది.  


శ్రీకాకుళం:ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసునని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. టీడీపీ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై  విమర్శలు గుప్పించారు.శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసునని ఆయన చెప్పారు.గట్టిగా అరిస్తే బెదిరిపోయేవాడిని కాదన్నారు. వామానావతారంలాగే భూమిలోకి తొక్కేస్తానని ఆయన హెచ్చరించారు.వంద కాదు వెయ్యి అడుగులైనా ముందుకు పోతానని ఆయన చెప్పారు. తమ్మినేని ముందు నీ అరుపులు, కేకలు పనిచేయవన్నారు.

కొన్ని రోజులుగా మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై కేసులు నమోదయ్యాయి. తమ్మినేని సీతారాం ఉద్దేశ్యపూర్వకంగానే తన భర్తపై  కేసులు నమోదు చేశారని  రవికుమార్ భార్య గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?