ఉమ్మడి అసెంబ్లీలో ఎన్టీఆర్ ఎపిసోడ్ పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం కల్పించలేదు, ఆ పాపంలో తనకు భాగస్వామ్యం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఈ పాపం చేసినందుకు తాను పశ్చాత్తాపానికి గురైనట్టుగా ఆయన తెలిపారు.ఈ కారణంగానే తాను 15 ఏళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితమయ్యాయని సీతారాం తెలిపారు.
Also read:పిచ్చాస్పత్రిలో చేర్చినా మీరు మారరు: టీడీపీపై జగన్ ధ్వజం
మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై తమ్మినేని సీతారాం స్పందించారు. టీడీపీ నుండి బహిష్కరణకు గురైన వల్లభనేని వంశీకి మాట్లాడే అవకాశం కల్పించడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం జరపకుండా వల్లభనేని వంశీకి మాట్లాడే అవకాశం కల్పించడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది శాసనసభా.... వైసీపీ కార్యాలయమా అంటూ విమర్శలు చేశారు. వల్లభనేని వంశీ మాట్లాడిన తర్వాత ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా పోల్చడంపై ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల,ను వెనక్కు తీసుకోవాలని స్పీకర్ టీడీపీ సభ్యుకు సూచించారు.
పవిత్రమైన అసెంబ్లీని పార్టీ కార్యాలయంగా పోల్చడం సరైంది కాదన్నారు. గతంలో కూడ అసెంబ్లీలో ఏం జరిగాయో కూడ ప్రజలకు తెలుసునని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై ప్రజలు మర్చిపోయే అవకాశం లేదన్నారు. అసెంబ్లీగా వ్యవహరించారో, పార్టీ కార్యాలయంగా వాడారో అందరికీ తెలుసునని పరోక్షంగా టీడీపీ సభ్యులకు స్పీకర్ తమ్మినేని సీతారాం చురకలు అంటించారు.
1995 ఆగష్టు సంక్షోభ సమయంలో అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలను స్పీకర్ తమ్మినేని సీతారాం పరోక్షంగా ప్రస్తావించారు. ఈ పాపంలో తాను కూడ భాగస్తుడిని చెప్పారు. ఆనాడు అసెంబ్లీ ఎన్టీఆర్‌ను మాట్లాడించలేదని ఆయన చెప్పారు.ఆనాడు ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై తాను విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
అసెంబ్లీలోనే వైసీపీ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయాన్ని చూసి రావాలని కూడ టీడీపీ సభ్యులకు సలహా ఇచ్చారు. అన్ని పార్టీలకు అసెంబ్లీలో శాసనపసభపార్టీ కార్యాలయాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
సభలో మాట్లాడుతానని ఓ సభ్యుడు కోరినప్పుడు తనకు ఉన్న విచక్షణ అధికారాలతో ఆయనను మాట్లాడేందుకు అవకాశం కల్పించినట్టుగా స్పీకర్ తమ్మినేని సితారాం చెప్పారు. తనకు ఉన్న అధికారుల పరిమితులు తెలుసు, అపరిమిత అధికారుల గురించి కూడ తనకు తెలుసునని సీతారాం స్పష్టం చేశారు.
ఏ అధికారాలను ఎప్పుడు ఉపయోగించాలో కూడ తనకు తెలుసునన్నారు. అసెంబ్లీ ఎవరి జాగీరు కాదని ఆయన చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చారు. ప్రజల జాగీరు అంటూ ఆయన సమాధానమిచ్చారు.