బాబు మీద జనానికి నమ్మకం పోయింది.. మరో రెండు మూడు సార్లు జగనే సీఎం: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 1, 2022, 4:38 PM IST
Highlights

టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) విరుచుకుపడ్డారు ఏపీ శాసనసభ స్పీకర్ (ap assembly speaker) తమ్మినేని సీతారాం (tammineni sitaram). చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఆయన వల్ల టీడీపీ మీదనే కాకుండా, రాజకీయ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోయిందని తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) విరుచుకుపడ్డారు ఏపీ శాసనసభ స్పీకర్ (ap assembly speaker) తమ్మినేని సీతారాం (tammineni sitaram) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఆయన వల్ల టీడీపీ మీదనే కాకుండా, రాజకీయ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోయిందని తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారో అచ్చెన్నాయుడు (atchannaidu ) చెప్పాలని సీతారాం నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలు సీఎం జగన్ పై నమ్మకంతో ఉన్నారని, మరో రెండు, మూడు పర్యాయాలు జగనే సీఎం అవుతారని స్పీకర్ జోస్యం చెప్పారు. 

అంతకుముందు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో చేసిన రుణభారంతో రాష్ట్రం కుదలైందని, ఆ తర్వాత కరోనా పరిస్థితులు వచ్చాయని.. అయినప్పటికీ వాటన్నింటిని ఎదుర్కొని సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలలు మాత్రం ఒకింత వెసులుబాటుతో పాలించిన జగన్ (Ys jagan) .. ఆ తర్వాత ఎదురైన సవాళ్లను తట్టుకుంటూ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. తొలి ఏడాదిలో 95 శాతం హామీలను పూర్తి చేశారని చెప్పారు. వందకు వంద శాతం పూర్తి చేసే దిశగా సాగుతున్నామని తెలిపారు. పథకాల అమలు కోసం గ్రామ, వార్డు వాలంటీర్ల కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం. 

Also Read:అసెంబ్లీలో చంద్రబాబు శపథం వీడియో వైరల్... స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం

30 నెలల కాలంలో 1.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోకి చెల్లింపు చేశామని.. దేశ చరిత్రలోనే ఇలా చేయడం తొలిసారి అని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా.. అర్హత ఉన్నవారికి లబ్ది చేకూరుస్తున్నట్టుగా తెలిపారు. ఎవరైనా అర్హత కలిగి లబ్ది పొందలేకపోయితే వారికి మరో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పారదర్శకతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. 

వచ్చిన ఏడాదే 1.30 లక్షల ఉద్యోగాలు కల్పించామని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. క్యాలెండర్ ప్రకారం పోస్టులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అయితే తాము వీటిని ప్రచారం చేసుకోకలేకపోతున్నామని.. బాధ్యతగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. సంక్షేమ ఫలాలు కిందిస్థాయికి అందింతే వారే తమను గుర్తిస్తారనే నమ్మకంతో జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షం పేరుతో విషం కక్కుతున్న పట్టించుకోకుండా అభివృద్ది కోసం పని చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు సూటిగా ప్రశ్నించలేక.. సమస్యలను క్రియేట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. 20 ఏళ్ల క్రితం ఇటువంటి రాజకీయాన్ని ఎవరూ ఊహించలేదని అన్నారు. 
 

click me!