మూడుసార్లు గైర్హాజరైతే డిజ్ క్వాలిఫై: వైసీపీ ఎమ్మెల్యేలకు కోడెల ఝలక్

By Nagaraju penumalaFirst Published Feb 8, 2019, 5:53 PM IST
Highlights

తాను ఎన్నిసార్లు రిక్వస్ట్ చేసినా శాసనసభ సమావేశాలకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఎందుకు రావడం లేదో తెలియదన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో అనేక గొప్ప విషయాలు జరిగాయన్నారు. సభ్యులందరికీ అవగాహన కల్పించామని అనేక సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. 
 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు సమావేశాల నుంచి ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి హాజరుకాకపోవడం బాధ కలిగించిందన్నారు. రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయినప్పటికీ శాసన సభ నిండుగా ఉండాలని తాను కోరుకుంటానని తెలిపారు.

తాను ఎన్నిసార్లు రిక్వస్ట్ చేసినా శాసనసభ సమావేశాలకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఎందుకు రావడం లేదో తెలియదన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో అనేక గొప్ప విషయాలు జరిగాయన్నారు. సభ్యులందరికీ అవగాహన కల్పించామని అనేక సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎందుకు వెయ్యడం లేదో చెప్పాలని డిమాండ్ చేస్తూ తనపై ప్రతిపక్ష పార్టీలు అనేక ఆరోపణలు చేశాయని గుర్తు చేశారు. శాసన సభకు వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే వారిపై అనర్హత వేటు వెయ్యోచ్చు అని చెప్పుకొచ్చారు. 

అందువల్ల కొంతమంది అధికార పార్టీ సభ్యులు తనకు చెప్పి వెళ్లేవారని స్పష్టం చేశారు. అయితే కొంతమంది సభ్యులు వారు అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించేవారని, ఇతర శాసన సభ కమిటీ సమావేశాలకు హాజరై అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్నితప్పుబట్టేవారని చెప్పుకొచ్చారు. 

ఇలాంటి వైరుధ్యమైన అనుభవాలు ఎదురైనప్పుడు విచక్షణకే వదిలేశానని తెలిపారు. నా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించానని భావిస్తున్నట్లు కోడెల శివప్రసాదరావు తెలిపారు. సభను ఇంత హుందాగా నడిపించేందుకు సహకరించిన ప్రతీ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

శాసనసభాపతి పదవి ఉగాది పచ్చడిలాంటిది: స్పీకర్ కోడెల

click me!