అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రులు

Published : Sep 15, 2022, 11:11 AM IST
అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్, ఇతర సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్టుగా స్పీకర్ తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్, ఇతర సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్టుగా స్పీకర్ తెలిపారు. అనంతరం టీ బ్రేక్ కోసం శాసనసభను వాయిదా వేశారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం సమీపంలోకి వెళ్లి నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యనే సభలో స్పీకర్ తమ్మినేని ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. 

టీడీపీ సభ్యుల తీరును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు కావాలనే రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల ప్రశ్నలు కూడా ఉన్నాయని అన్నారు. కరోనా సమయంలో సమావేశాలు జరిగినప్పుడు ప్రశ్నోత్తరాలు పెట్టమని గొడవ చేసిన టీడీపీ.. ఇప్పుడు వద్దంటోందని మండిపడ్డారు. సభలోకి ఫ్లకార్డులు తీసుకురావడంతో సరికాదని అన్నారు. 

టీడీపీ ఎమ్మెల్యేల చర్యలు తీసుకోవాలి.. మంత్రి అంబటి
శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ సభ్యులు యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ సభ్యులు సభలో ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. తమను కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యుల ప్రశ్నలకే తాను సమాధానం చెబుతున్నానని.. కానీ అది వినే ఉద్దేశం కూడా వారిని లేదని విమర్శించారు. టీడీపీ సభ్యులు బయటకు వెళ్లాలనే ఉద్దేశంతోనే సభలో గందగోళం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. టీడీపీ సభ్యులపై చర్య తీసుకోకుంటే.. వారు సభను జరగనివ్వరని అన్నారు. 

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు..
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి అంబటి రాంబాబు సభలో తెలిపారు. టీడీపీ సభ్యుల ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. శ్రీశైలం ప్రాజెక్టు ముందు ఏర్పడిన పూల్‌ను గత టీడీపీ ప్రభుత్వం అశ్రద్ద చేసిందని విమర్శించారు. దానిని సరిచేసి శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాద దశకు వెళ్లకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని అన్నారు. 

ఆ తర్వాత మరోసారి మాట్లాడిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. టీడీపీ సభ్యుల ప్రశ్నలకే సమాధానం ఇస్తుంటే వారే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సభను అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే ప్రీ ప్లాన్డ్‌గా వచ్చారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేనిని కోరారు. 

ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం.. 
ఇటీవలి కాలంలో మరణించిన మాజీ సభ్యులకు శాసనసభ సంతాపం తెలిపింది. శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్ పుష్పరాజ్, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్లసభ్యులు  సంతాపం ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?