జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టూ నిలబడి ఆందోళన చేశారు. స్పీకర్ పై కాగితాలు చింపి విసిరేశారు. టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రులు డిమాండ్ చేశారు.
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా Jangareddy Gudem మిస్టరీ మరణాలపై చర్చకు పట్టుబడుతూ TDP సభ్యులు సోమవారం నాడు AP Assembly లో డిమాండ్ చేశారు. Speaker పోడియం చుట్టుముట్టి నిరసనకు దిగారు. స్పీకర్ Tammineni Sitaram పై పేపర్లు చింపివేశారు. దీంతో పలువురు మంత్రిులు టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టూ నిలబడి నినాదాలు చేశారు.
ఇవాళ ఉదయం శాసనసభ ప్రారంభానికి ముందు జంగారెడ్డి గూడెం మిస్టరీ మరణాలపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభమైన తర్వాత ఈ విషయమై టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు.సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అంతరాయం కల్గిస్తున్నారని అధికార పార్టీ సభ్యులు సీరియస్ అయ్యారు. ఈ విషయమై టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ శాసనసభను వాయిదా వేశారు.
అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. టీడీపీ సభ్యులను వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు.
మరో వైపు సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని పలువురు మంత్రులు, YCP సభ్యులు కోరారు. మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు, కన్నబాబులు ఈ విషయమై మాట్లాడుతూ టీడీపీ సభ్యులు డ్రామాలు చేస్తున్నారని మండి పడ్డారు. మద్య నిషేధం మాట్లాడే హక్కు టీడీపీకే లేదన్నారు. టీడీపీ సభ్యులను సభ నుండి స్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు.
ఇటీవల కాలంలో జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది కల్తీ సారా తాగడం వల్లనే చనిపోయారనే ప్రచారం కూడా లేకపోలేదు.
ఈ మరణాలపై దర్యాప్తు నిర్వహించడానికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హైమావతి విజయవాడ జీజీహెచ్ డాక్టర్ల టీమ్ జంగారెడ్డి గూడెనికి చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్లకు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి వివరాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అలవాటు ఉందని చెప్పారు. ఇందులో పలువురు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారని తెలిపారు. మరి కొందరు 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నరని పేర్కొన్నారు. అయితే మృతుల కుటుంబీకులు మాత్రం తమవారు కల్తీ సారా తాగడం వల్లనే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మరణాల నేపథ్యంలో పలువురు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. గురువారం ఒకరు హాస్పిట్ లకు వెళ్లిన కొంత సమయానికి మృతి చెందారు. అయితే ఆయన మృతదేహానికి పోస్టు మార్టం చేయలేదు. ఇలా మృతి చెందిన వారెవరికీ పోస్టు మార్టం నిర్వహించలేదు. దీంతో అసలు మరణాలు ఏ కారణంతో సంభవిస్తున్నాయనే అంశంపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు.