ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు జరగనుంది.
హైదరాబాద్: ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు జరగనుంది.
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై గతంలో కూడ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ సమావేశం జరగనుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వివరణ అడిగే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై ఎస్ఈసీకి నోటీసులు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.
జూమ్ విధానంలో ఈ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. గతంలో కూడ జూమ్ విధానంలో సమావేశం నిర్వహించారు.