సీఎం స్థానాన్ని అవమానించింది జగనే: కొడాలి నాని, రోజాలపై చంద్రబాబు ఆగ్రహం

By Nagaraju penumala  |  First Published Dec 13, 2019, 11:08 AM IST

ముఖ్యమంత్రిని ఉరివేయాలన్నారు, ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టాలన్నారు, ఒక మంత్రి అయితే ఏకంగా నియమ్మ మెుగుడు కట్టించాడా అన్నారు, మరోకరు అయితే చిన్నమెుదడు చితికింది అంటూ బూతులు తిట్టింది వైసీపీ నాయకులు కాదా అని నిలదీశారు. 


అమరావతి: ముఖ్యమంత్రి స్థానాన్ని అవమానిస్తూ, బండబూతులు తిట్టిన వ్యక్తి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డేనని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 

ముఖ్యమంత్రిని ఉరివేయాలన్నారు, ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టాలన్నారు, ఒక మంత్రి అయితే ఏకంగా నియమ్మ మెుగుడు కట్టించాడా అన్నారు, మరోకరు అయితే చిన్నమెుదడు చితికింది అంటూ బూతులు తిట్టింది వైసీపీ నాయకులు కాదా అని నిలదీశారు. 

Latest Videos

undefined

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తాను చర్చించేందుకు సమయం ఇవ్వకపోవడంతో బయట ధర్నా చేస్తున్నామని అలాంటి సందర్భంలో అసెంబ్లీకి వస్తే తనను అడ్డుకుంటారా అంటూ మండిపడ్డానని చెప్పుకొచ్చారు. 

బాత్ రూమ్ ల దగ్గర దాక్కునేవాళ్లం, టీడీపీ అంతలా వేధించింది: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన...

ఒక జైలు దగ్గర ఎంతటి బందోబస్తు ఉంటుందో అంతలా చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలోనే తాను వాట్ నాన్సెన్స్ అని మాత్రమే అన్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారని మార్షల్స్ ను నిలదీశానే తప్ప దురుసుగా ప్రవర్తించలేదని, దుర్భాషలాడలేదని చెప్పుకొచ్చారు. 

పౌరుషంగా మాట్లాడటం గానీ నేరాలు చేయడం గానీ తనకు చేతకాదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకే అవన్నీ అలవాటు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను పనిచేశానని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇప్పటికీ ఎప్పటికీ కృషి చేస్తానని తెలిపారు. 

తనను అసెంబ్లీలోకి రానివ్వకపోవడంతోనే తాను గట్టిగా మాట్లాడానని అది కూడా అసెంబ్లీలోకి రానివ్వడం లేదనే తప్ప మరో విషయం గురించి కాదన్నారు చంద్రబాబు నాయుడు. ఇదే విషయాన్న అధికార పక్ష సభ్యులకు, ప్రజలకు కూడా తెలియజేస్తున్నానని వాట్ నాన్సెన్స్ అని మాత్రమే అని గట్టిగా అని హెచ్చరించాన్న విషయాన్ని గమనించాలని కోరారు చంద్రబాబు నాయుడు. 

మార్షల్స్‌ను చంద్రబాబు బాస్టర్డ్ అంటారా: జగన్...

 


గురువారం అసెంబ్లీ బయట చోటు చేసుకున్న ఘటనకు తనను క్షమాపణలు చెప్పమనడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎందుకు చెప్పాలో స్పష్టం చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. 

బయట జరిగిన గొడవకు అసెంబ్లీలో క్షమాపణలు చెప్పమంటున్నారని తనను లోపలికి రాకుండా అడ్డుకోవడం తనకు అవమానంగా ఫీలవుతున్నానని దానికి ఎవరూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారో చెప్పాలని నిలదీశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, నవ్యాంధ్రప్రదేశ్ లోనూ తాను ముఖ్యమంత్రిగా పనిచేశానని అలాంటి తనను అడ్డుకోవడం అగౌరవం కాదా అని నిలదీశారు. తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అన్న ఆందోళన ప్రతీ ఒక్కరికీ ఉంటుందన్నారు చంద్రబాబు నాయుడు.  
 

click me!