ఆ నాయుడు మీ చుట్టం కాదా, అన్నీ బయటపెడతాం: చంద్రబాబుపై జగన్

By Nagaraju penumala  |  First Published Dec 17, 2019, 10:38 AM IST

 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని కార్పొరేషన్లను చంద్రబాబు సన్నిహితులకే కట్టబెట్టారని ఆరోపించారు. చివరికి దేవాలయాల్లో క్లీనింగ్ చేసే దానికి కాంట్రాక్ట్ ను కూడా చంద్రబాబునాయుడుకు సమీప బంధువు అయిన భాస్కర్ నాయుడుకు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. 


అమరావతి: తెలుగుదేశం పార్టీ సభ్యులు తనకు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. సభలో పచ్చి అబద్దాలు చెప్పేందుకే టీడీపీ సభ్యులు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే అబద్దాలు చెప్పేవాళ్లు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వకపోతే ఏమిస్తారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ నే ఒక గొప్ప ఆలోచనతో తాము ప్రారంభించి నిరుద్యోగులకు ఒక అద్భుత అవకాశాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ పేరుతో లంచాలు తీసుకోవడం, ఉద్యోగం ఇస్తున్నామని, ఇచ్చిన తర్వాత కూడా లంచాలు తీసుకోవడం, ఆఖరికి జీతాలు తీసుకునే సమయంలో కూడా లంచాలు తీసుకోవడం జరుగుతూ ఉందని ఆరోపించారు. 

Latest Videos

ఇలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అందరికీ లంచాలు ఇస్తూ పోతుంటే ఆ ఉద్యోగి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అలాంటి క్రమంలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తాము ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. 

 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని కార్పొరేషన్లను చంద్రబాబు సన్నిహితులకే కట్టబెట్టారని ఆరోపించారు. చివరికి దేవాలయాల్లో క్లీనింగ్ చేసే దానికి కాంట్రాక్ట్ ను కూడా చంద్రబాబునాయుడుకు సమీప బంధువు అయిన భాస్కర్ నాయుడుకు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. 

ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అంటూ ఆరోపించారు. తన వాళ్లకు ఔట్ సోర్సింగ్ కట్టబెట్టి మెుత్తం దోచే కార్యక్రమాన్ని చేపట్టింది చంద్రబాబు నాయుడు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు నాయడు దోపిడీ వ్యవస్థను చంద్రబాబు పెంచిపోషిస్తే తాను ఆ వ్యవస్థకు చరమ గీతం పాడాలని భావించినట్లు  జగన్ చెప్పుకొచ్చారు. 

భాస్కర్ నాయుడుకు దేవాలయాల్లో క్లీనింగ్ కు సంబంధించి కాంట్రాక్ట్ ను కట్టబెట్టి దానికి నిధులు పెంచుకుంటూ పోయారని ఆరోపించారు. ఆ భాస్కర్ నాయుడుకు చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏంటో తనకు తెలుసునని ఏవిధంగా వారు ఉపయోగపడ్డారో కూడా ఆధారాలు ఉన్నాయని జగన్ స్పష్టం చేశారు. 

భాస్కర్ నాయుడు ఎవరో, ఏ విధంగా బంధువో అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వాటిని బయటపెడతామని ఆరోపించారు సీఎం జగన్. ఔట్ సోర్సింగ్ ద్వారా నిరుద్యోగులకు, ఉద్యోగులకు పారదర్శకంగా జీతాలు అందించేలా ఔట్ సోర్సింగ్ కార్యక్రమం తీసుకువచ్చినట్లు జగన్ స్పష్టం చేశారు. 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు..

click me!