ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మంగళవాారం నాడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మంగళవారం నాడు అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.
Also read:ఆర్టీసీ విలీన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
టీడీపీ ఎమ్మెల్యేలు బఫూన్లు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అసెంబ్లీ సెక్రటరీకి మంగళవారం నాడు ఉదయమే అనగాని సత్యప్రసాద్ ఫిర్యాదు చేశారు.
మరో వైపు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఏపీ మంత్రులపై కూడ టీడీపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు మరొక నోటీసును కూడ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో పూర్తి కానున్నాయి. గత వారంలో కూడ టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.