
చంద్రన్న సిగలో మరో కొత్త పథకం లాంచ్ అవ్వబోతోంది. బిసి సామాజిక వర్గంలో పెళ్లి చేసుకునే పేద వధూవరులకు ఏపీ ప్రభుత్వం ఇకపై 'చంద్రన్న పెళ్లి కానుక' పేరుతో రూ.30వేలు అందించనుంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ఈ కీలక నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2018 జనవరి 1 నుంచి అమల్లోకి తేవాలని యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతోంది. మూడో విడత రైతు రుణమాఫీ, ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరుగుతోంది.