సంకల్పం చేస్తే వర్షాలు పడతాయా ?

First Published Oct 10, 2017, 4:21 PM IST
Highlights
  • మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ?
  • అంటే చంద్రబాబునాయుడు అవుననే సమాధానం చెబుతారేమో ?
  • ఎందుకంటే, తాను  నదులకు హారతులిచ్చి మహా సంకల్పం చేయబట్టే రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయట.  

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? అంటే చంద్రబాబునాయుడు అవుననే సమాధానం చెబుతారేమో ? ఎందుకంటే, తాను  నదులకు హారతులిచ్చి మహా సంకల్పం చేయబట్టే రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయట.  మంగళవారం జరిగిన టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు అలా అనే చెప్పారు. సమావేశంలో మాట్లాడుతూ, 15 ఏళ్ళ తర్వాత అనంతపురం జిల్లాలో వరదలు వచ్చాయన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ గురించి మాట్లాడుతూ, ముద్రగడను ఎవ్వరూ నమ్మటం లేదన్నారు. ప్రభుత్వం కాపులకు అన్నీ చేస్తున్నా, ముద్రగడ అనవసరంగా ఉద్యమాలు చేస్తున్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

వైసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా కోసం ఈరోజు అనంతపురంలో జరిగిన యువభేరి గురించి మాట్లాడుతూ, వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా యువభేరిలు ఎందుకంటూ ఎద్దేవా చేసారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా పై వస్తున్న ఆరోపణల సంగతి ఆ పార్టీనే చూసుకుంటుందన్నారు. పార్టీ నేతల గురించి మాట్లాడుతూ, స్ధానిక నేతలతో కలిసి పనిచేయాలని, ప్రభుత్వంపై జనాల్లో సంతృప్త స్ధాయిలను 80 శాతానికి తీసుకెళ్లాలని గట్టిగా చెప్పారు. నియోజకవర్గాల్లోని అసంతృప్తులను కలుపుకుని వెళ్ళాలని నేతలకు సూచించారు.

click me!