ఈ నెల 28న మరో అల్పపీడనం.. ఆగస్టు 3 వరకు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు

By Siva KodatiFirst Published Jul 24, 2021, 5:31 PM IST
Highlights

ఈ నెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వివరించింది. 
 

ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుదున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ నెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వివరించింది. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆగస్టు 3 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది

click me!