ఏపీ అసెంబ్లీ ఉద్యోగుల్లో మరో 9 మందికి కరోనా: బెజవాడలో లాక్ డౌన్

By telugu team  |  First Published Jul 20, 2020, 1:50 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని ఉద్యోగుల్లో మరో 9 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అసెంబ్లీ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలావుంటే, విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పనిచేస్తున్న మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.దీంతో అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య 17కు‌‌ చేరుకుంది. మరికొన్ని రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నాయి. 

అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రమవుతున్నందున వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని అసెంబ్లీ ఉద్యోగులు కోరుతున్నారు.

Latest Videos

undefined

ఇదిలావుంటే, విజయవాడనగరంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 21 క్లస్టర్లలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సోమవారం నుండి రాకపోకలపై నియంత్రణ అమలు చేస్తున్నారు. 

అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో కోవిడ్19 క్లస్టర్లుగా ఈ ప్రాంతాలను ప్రకటించారు. అవిపటమట, కృష్ణలంక, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్

click me!