అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తా....

First Published Jun 30, 2017, 6:13 PM IST
Highlights

రిపబ్లిక్ టివి జరిపిన స్టింగ్ ఆపరేషన్లో వివాదం గురించి జెసి మాట్లాడుతూ, ‘జరిగిన వివాదంపై తాను క్షమాపణ చెప్పే ప్రశక్తే లేద’ని తేల్చేసారు. ‘క్షమాపణ చెప్పాల్సిన అవసరమే వస్తే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళిపోతానే గానీ క్షమాపణ మాత్రం చెప్పనం’టూ స్పష్టంగా చెప్పారు.

విశాఖపట్నం విమానాశ్రయం వివాదంలో క్షమాపణ చెప్పాల్సి వస్తే పార్టీకి రాజీనామా చేయటానికి అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి సిద్దంగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పారు. సమయం గడిచిపోయిన తర్వాత విశాఖపట్నం విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ కోసం జెసి చేసిన వీరంగం అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఎప్పుడైతే గొడవ వెలుగు చూసిందో వెంటనే కొన్ని దేశీయ విమానయాన సంస్ధలు జెసిని విమాన ప్రయాణం నుండి నిషేంధించాయి. అయితే, విచిత్రమేంటంటే అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎంపి విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు అదే విమానంలో వచ్చేసారు. ఒకవైపు దేశవ్యాప్తంగా జెసి చర్యలపై విమర్శలు వస్తుండగానే కుటుంబంతో కలిసి ప్యారిస్ కు కూడా వెళ్ళిపోయారు.

సరే ఇదంతా జరిగి సుమారు  రెండు వారాలపైనే అయిపోయిందనుకోండి అదివేరే సంగతి. అయితే, తాజాగా రిపబ్లిక్ టివి జరిపిన స్టింగ్ ఆపరేషన్లో వివాదం గురించి జెసి మాట్లాడుతూ, ‘జరిగిన వివాదంపై తాను క్షమాపణ చెప్పే ప్రశక్తే లేద’ని తేల్చేసారు. ‘క్షమాపణ చెప్పాల్సిన అవసరమే వస్తే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళిపోతానే గానీ క్షమాపణ మాత్రం చెప్పనం’టూ స్పష్టంగా చెప్పారు. ఒకవైపు వివాదానికి ముగింపు పలికేందుకు విమానయాన సంస్ధకు జెసి చేత క్షమాపణ చెప్పించాలని చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో జెసి చేసిన ప్రకటన ఇటు చంద్రబాబును అటు అశోక్ గజపతిరాజును ఒకేసారి ఇరకాటంలోకి నెట్టేసాయి.

click me!