మండలిలో ''గడ్డం''పై వివాదం... ఛైర్మన్ షరీఫ్, చంద్రబాబులూ రౌడీలేనా: మంత్రి అనిల్

By Arun Kumar PFirst Published Jun 17, 2020, 12:34 PM IST
Highlights

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య శాసనమండలిలో  మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య శాసనమండలిలో  మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అచ్చెన్నాయుడు అరెస్టును లేవనెత్తిన టీడీపీ సభ్యులు లేవనెత్తారు. వైసిపి ప్రభుత్వం బీసీ నాయకులను అనగదొక్కుతున్నారని టీడీపీ ఎంఎల్సీ నాగ జగదీశ్వర్ ఆరోపించారు. 300 మంది పోలీసులతో అరెస్ట్ చేసి ఆపరేషన్ అయిన వ్యక్తిని సుదీర్ఘ ప్రయాణంతో వేదించారన్నారు. 

ఈ వ్యాఖ్యలపై మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ... అచ్చెన్నాయుడు దొంగతనం చేసాడు కాబట్టే జైలుకు వెళ్లాడన్నారు.గతంలో ముద్రగడను మూడువేల మంది పోలీసులతో అరెస్ట్ చేయించారన్నారు.   

read more  వికేంద్రీకరణ బిల్లును మళ్లీ అడ్డుకుంటాం...ఎలాగో మీరే చూడండి: యనమల

గడ్డం పెంచిన రౌడీలు సభకు వస్తున్నారని సోషల్ మీడియాలో మంత్రుల గురించి పోస్టులు పెడుతున్నారన్న టీడీపీ ఎంఎల్సీ దీపక్ రెడ్డి అన్నారు. దీనికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ''గడ్డం పెంచుకున్నవారందరూ రౌడీలా...? అయితే మీకు గడ్డం ఉందంటే మీరు రౌడీనా...?అంతేకాదు టిడిపి అధ్యక్షులు చంద్రబాబుకి గడ్డం ఉందంటే ఆయన రౌడీనా...?''అని చైర్మన్ షరీఫ్ ను అడిగారు. ఈ వాగ్వివాదంతో సభ నడిపే పరిస్థితి లేకపోవడంతో కొద్దిసేపు వాయిదా వేశారు ఛైర్మన్ షరీప్. 

సభ వాయిదా తర్వాత కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య  వాగ్వివాదం కొనసాగింది. మంత్రి అనిల్, టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అనిల్ ను మంత్రి అవంతి, జగదీశ్వరరావు ను ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అడ్డుకుని సముదాయించారు. 
 

click me!