నా బిజినెస్ దెబ్బతీస్తున్నారు, నన్ను టార్గెట్ చేశారు: జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి

By narsimha lodeFirst Published Jun 17, 2020, 12:06 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ తనను టార్గెట్ చేశారని, తన బిజినెస్ ను దెబ్బతీస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.

కడప: ఏపీ సీఎం వైఎస్ జగన్ తనను టార్గెట్ చేశారని, తన బిజినెస్ ను దెబ్బతీస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.

కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లికి బుధవారం నాడు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ తనను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా భయపడనని చెప్పారు. 

also read:జేసీ ప్రభాకర్‌రెడ్డితో ములాఖత్‌కు లోకేష్ జైలు అధికారులు నో

అవసరమైతే వ్యవసాయం చేసుకొనైనా బతుకుతానని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి గురించి ఆలోచించడం జగన్ మానేశారన్నారు. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనాలని జగన్ ఆలోచనగా ఉందన్నారు.

నకిలీ పత్రాలతో  వాహనాలు విక్రయించారనే కేసులో జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను ఈ నెల 13వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు.

also read:

ఈ కేసులో కడప సెంట్రల్ జైలులో వీరిద్దరూ ఉన్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా నమ్మించి విక్రయించారని కొందరు లారీ యజమానులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అదే రోజున జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే నకిలీ పత్రాలతో తమకు వాహనాలు విక్రయించారని ఈ విషయమై విచారణ జరిపించాలని నాగాలాండ్ డీజీపీకి అస్మిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా ఈ నెల 13వ తేదీనే జేసీ పవన్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు.
 

click me!