ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో 33 ఏళ్ల కీచక టీచర్ తాను పాఠాలు బోధిస్తున్న 17 ఏళ్ల మైనర్ బాలికను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడు. అబద్ధాలు చెప్పి తిరుపతికి తీసుకెళ్లాడు. ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోయినట్టు బాలిక గ్రహించి తల్లిదండ్రులకు సమాచారం చెప్పింది. నిందితుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో బుద్ధి మాటలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు గడ్డి తిన్నాడు. తాను పాఠాలు బోధించాల్సిన విద్యార్థినిలో తప్పుడు ఆలోచనకు బీజం వేశాడు. ఆమెను అబద్ధాలతో మోసం చేశాడు. నమ్మించి తిరుపతికి తీసుకెళ్లి.. ఓ దేవాలయంలో మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏరియాలో చోటుచేసుకుంది. నిందిత ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
33 ఏళ్ల చలపతిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు వివరించారు. చలపతి ఓ ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడని తెలిపారు. ఆయనకు అప్పటికే పెళ్లైంది. ఒక కూతురు కూడా ఉన్నది. ఆ తర్వాతే 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికను తప్పుదారి పట్టించాడు.
undefined
బుధవారం ఆ బాలికకు ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఆ తర్వాత చలపతి ఆమెను అబద్ధాలతో నమ్మించి తిరుపతికి తీసుకెళ్లాడు. తాను నిజాయితీపరుడినని, తనపై విశ్వాసం ఉంచాలని బాలికను నమ్మించాడు. ఆమె పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని నమ్మబలికినట్టు ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.
Also Read: ఉపాధ్యాయుడి కీచక పర్వం..ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. ఆపై..
అక్కడే ఓ ఆలయంలో వారిద్దరికి పెళ్లి జరిగింది. ఆ తర్వాత చలపతి ప్రవర్తనలో మార్పును బాలిక గమనించింది. వెంటనే ఆ బాలిక మొత్తం ఉదంతాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తన తల్లిదండ్రులతో గంగవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు.