విద్యార్థులకు అలర్ట్.. ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్స్ తేదీలు ఇవే..

Published : Feb 10, 2022, 01:48 PM ISTUpdated : Feb 10, 2022, 01:55 PM IST
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్స్ తేదీలు ఇవే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. మే 2వ తేదీన నుంచి మే 13 వరకు 10 తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరగనున్నాయి. మార్చి 11 నుంచి 31వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని మంత్రులు తెలిపారు. 

కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలను కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని మంత్రి తెలిపారు. ఇంటర్ రెండు సంవత్సరాలు కలిపి మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని చెప్పారు. ఇక, మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

పదో తరగతి పరీక్షలు..
-మే 2 నుంచి 13 వరకు పరీక్షలు జరగనున్నాయి.
- ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్

ఇంటర్ పరీక్షలు.. 
- ఏప్రిల్ 8 నుంచి 28 వరకు పరీక్షలు జరగనున్నాయి.
- ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్
- మార్చి 11 నుంచి 31వరకుప్రాక్టికల్ ఎగ్జామ్స్ 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలకు వేసవి వార్నింగ్.. ఐఎండీ బాంబు పేల్చిందిగా !
Kakinada Blast : 18 మంది మృతి.. కాకినాడ పేలుడు వెనుక అసలు కారణం ఇదేనా?