చంద్రబాబు అన్‌పార్లమెంటరీ పదాలు వాడారు: స్పీకర్ తమ్మినేని

By narsimha lodeFirst Published Dec 13, 2019, 11:20 AM IST
Highlights

ఏపీ అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్ పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. 

అమరావతి: అసెంబ్లీ గేటు వద్ద గురువారం నాడు మార్షల్స్ కు టీడీపీ సభ్యులకు మధ్య జరిగిన గొడవ విషయమై ఎథిక్స్ కమిటీకి పంపే విషయాన్ని పరిశీలించనున్నట్టు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.

శుక్రవారం నాడు  ఏపీ అసెంబ్లీలో  గురువారం నాడు చోటు చేసుకొన్న ఘటనలపై వీడియోను ప్రదర్శించారు. ఈ విషయమై పలువురు అధికారపక్షం సభ్యులు ప్రసంగించారు.

ఈ విషయమై స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. గురువారం నాడు ఘటనపై ఎథిక్స్ కమిటీకి పంపే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.  మార్షల్స్ సభ్యుల రక్షణ కోసం ఉన్నారని స్పీకర్ చెప్పారు. ఇది పార్టీల వ్యవహరం కాదన్నారు. ఇది సభ అంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. నిన్న అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనను పరిశీలించి నిర్ణయం తీసుకొంటానని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.

గురువారం నాడు ఏపీ అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్ తమను అడ్డుకొన్నారని టీడీపీ సభ్యులు సభలో ప్రస్తావించారు. గురువారం నాడు అసెంబ్లీ గేటు వద్ద చోటు చేసుకొన్న ఘటనలపై శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం జరిగింది.

మార్షల్స్‌ పట్ల టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును వైసీపీ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. అధికార పక్షానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. చంద్రబాబునాయుడు ఈ విషయమై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే ఈ విషయమై తనను ఈ అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలకు పాల్పడ్డారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. 

జరిగిన ఘటనలపై తాను పనిచేస్తానని తమ్మినేని సీతారాం చెప్పారు.  గురువారం నాడు అసెంబ్లీ గేటు వద్ద చోటు చేసుకొన్న పరిణామాలపై తాను రిపోర్ట్ ఇవ్వాలని తాను చీఫ్ మార్షల్స్‌ను కోరిన విషయాన్ని  స్పీకర్ గుర్తు చేశారు.

చంద్రబాబు అన్న వ్యాఖ్యలు సభ మొత్తం చూసిందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. చంద్రబాబునాయుడు అన్ పార్లమెంటరీ పదాలు వాడారని స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు మంచిది కాదన్నారు. ఎవరికైనా భావోద్వేగాలు ఉంటాయని స్పీకర్ అభిప్రాయపడ్డారు.

ఏదో పొరపాటు జరిగిందని చెబితే హుందాగా ఉంటుందని స్పీకర్ చెప్పారు. సభ్యులు కాని వారిని గుర్తించాలని పోలీసులను ఆదేశిస్తున్నట్టుగా స్పీకర్ సభలో ప్రకటించారు. సభ్యులు కానీ వారుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు.

click me!