కరోనాకు చెక్: కుక్కర్‌లో కరెన్సీకి ఆవిరి, కిరాణ యజమాని వినూత్న ఆలోచన

Published : Apr 26, 2020, 02:57 PM IST
కరోనాకు చెక్: కుక్కర్‌లో కరెన్సీకి ఆవిరి,  కిరాణ యజమాని వినూత్న ఆలోచన

సారాంశం

కరెన్సీ నోట్ల ద్వారా కూడ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఆవిరి పడుతున్నాడు. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన ఓ కిరాణ దుకాణ యజమాని వెరైటీగా ఆలోచించాడు.  


విజయవాడ: కరెన్సీ నోట్ల ద్వారా కూడ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఆవిరి పడుతున్నాడు. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన ఓ కిరాణ దుకాణ యజమాని వెరైటీగా ఆలోచించాడు.

కృష్ణా జిల్లా కైకలూరులో నరసింహారావు అనే వ్యక్తి విజయలక్ష్మి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు.కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నరసింహారావు కూడ జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. కరెన్సీ నుండి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగింది. అయితే ఈ నేపథ్యంలో  తన షాపులో సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు ఇచ్చే నగదును శానిటైజ్ చేస్తున్నాడు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ద్వారా కరెన్సీని ఆవిరి పడుతున్నాడు. ఈ ఆవిరి ద్వారా కరెన్సీ నోట్లపై ఏమైనా వైరస్ ఉంటే చనిపోయే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నాడు. కుక్కర్ అడుగు భాగంలో నీటిని పోసి మధ్యలో రంద్రాలున్న ప్లేటును అమర్చాడు. నీరు వేడి కావడం ద్వారా వచ్చే ఆవిరితో కరెన్సీ నోట్లను శానిటైజ్ చేస్తున్నాడు నరసింహారావు. ఈ ప్రక్రియ ద్వారా నగదు నోట్లపై ఉన్న వైరస్ లేదా ఇతర క్రిములుచనిపోతాయని ఆయన నమ్మకంగా చెబుతున్నాడు.

also read:ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 81 కేసులు, మొత్తం 1097కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా వైరస్ కేసులు 1097కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 52 కసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!